ETV Bharat / sitara

రివ్యూ: 'నారప్ప' సినిమా ఎలా ఉందంటే..

విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'నారప్ప'(Narappa). తమిళ మూవీ 'అసురన్​'కు (Asuran) రీమేక్​గా రూపొందింది. కరోనా కారణంగా ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?

narappa
నారప్ప
author img

By

Published : Jul 20, 2021, 6:45 AM IST

Updated : Jul 20, 2021, 8:54 AM IST

చిత్రం: నారప్ప; నటీనటులు: వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌ తదితరులు; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌; నిర్మాత: కలైపులి ఎస్‌.థాను, డి.సురేశ్‌బాబు; రచన: వెట్రిమారన్‌(అసురన్‌); స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల; బ్యానర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వి.క్రియేషన్స్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.

narappa
నారప్ప

వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ అటు కుటుంబ ప్రేక్షకులకు, ఇటు యువతకు ఎప్పుడూ దగ్గరగా ఉండే అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌(Venkatesh). ఇక క్లాస్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'నారప్ప'. తమిళ సూపర్‌హిట్‌ 'అసురన్‌' రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది. ఈ విషయం కాస్త వివాదమైనా నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపారు. మరి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన 'నారప్ప' ఎలా ఉంది? యువకుడిగా, తండ్రిగా వెంకటేశ్‌ ఏ మేరకు మెప్పించారు? శ్రీకాంత్‌ అడ్డాల టేకింగ్‌ ఎలా ఉంది? 'అసురన్‌'కు దీటుగా 'నారప్ప' ఉన్నాడా?

narappa
నారప్ప

కథేంటంటే: నారప్ప(వెంకటేశ్‌) తన భార్య సుందరమ్మ(ప్రియమణి)తో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో హాయిగా జీవితం సాగిస్తుంటాడు. అతడికి మునికన్నా(కార్తీక్‌ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. ఆ ఊరి పెద్ద పండు స్వామి(నరేన్‌).. తన తమ్ముడి దొరస్వామి(దీపక్‌ శెట్టి) కోసం ఊళ్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. కానీ, నారప్ప తన మూడెకరాల భూమిని మాత్రం ఇవ్వడు. ఈ విషయంలోనే పండు స్వామి, అతని మనుషులతో మునికన్నా గొడవపడి, పండుస్వామిని అవమానిస్తాడు. దీంతో మునికన్నాను దారుణంగా హత్య చేస్తారు. అన్నను చంపారన్న ప్రతీకారంతో పండుస్వామిని సిన్నబ్బ హత్య చేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. అప్పుడు నారప్ప ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

narappa
వెంకటేశ్​

ఎలా ఉందంటే: డబ్బు ఉన్న వాడికీ లేనివాడికి, బలవంతుడికీ బలహీనుడికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఎన్నో కథలు వెండితెరను అలరించాయి. బలహీనుడు తిరగబడితే ఎంతటి బలవంతుడైనా మట్టి కరవాల్సిందే. 'భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు' అంటూ చదువు ఆవశ్యకతను వివరిస్తూ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తమిళంలో వచ్చిన 'అసురన్‌' ఎంతగానో అలరించింది. అదే కథను వెంకటేశ్‌ కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల 'నారప్ప'గా తీయడంలో విజయం సాధించారు. మాతృకలోని ఉన్న ఎమోషన్స్‌ను తెలుగులోనూ కొనసాగిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.

narappa
ప్రియమణి

పోలీసులు, రౌడీల నుంచి నారప్ప కుటుంబం తప్పించుకునే సన్నివేశాలతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు మెల్లిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పండుస్వామి, నారప్ప కుటుంబాల మధ్య వివాదం జరగడం, పండుస్వామిని చెప్పుతో కొట్టి అమానించడం వల్ల ఇలా ప్రథమార్ధమంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే మునికన్నా హత్యకు గురవుతాడో కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఆ క్రమంలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగులుతున్నా నారప్ప తన చిన్న కొడుకును కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా అనిపిస్తాయి. విరామ సన్నివేశాల్లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌.

ద్వితీయార్ధంలో నారప్ప గతం చెప్పడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నాడు దర్శకుడు. మాతృక 'అసురన్‌'ను యథావిధిగా ఫాలో అయ్యాడు. నారప్ప యువకుడిగా ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు, నేపథ్యం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అవన్నీ పెద్దగా ఆకట్టుకోవు. అయితే, అటు యువకుడిగా, ముగ్గురు పిల్లలకు తండ్రిగా వెంకటేశ్‌ స్క్రీన్‌పై కనిపించిన తీరు మెప్పిస్తుంది. నారప్ప మేనకోడలిని అవమానించే సన్నివేశాల్లో బలమైన ఎమోషన్‌ లేదు. అయితే, ఫ్లాష్‌ బ్యాక్‌, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. ఇప్పటికే 'అసురన్‌' చూసిన వారికి 'నారప్ప'లో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించవు. దీంతో కథంతా ముందే తెలిసిపోవడం ఈ సినిమాకు కాస్త మైనస్‌.

ఎవరెలా చేశారంటే: నారప్ప వెంకటేశ్‌ వన్‌మెన్‌ షో అని చెప్పవచ్చు. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తుంది. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో వెంకీమామ అదరగొట్టాడనే చెప్పాలి. ప్రియమణి, కార్తీక్‌రత్నం, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా కార్తీక్‌రత్నం కనిపించేది కొద్దిసేపే అయినా, కథను మలుపు తిప్పే పాత్ర. సాంకేతికంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలు ఓకే. కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. అయితే, యాక్షన్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. 'రా రా నరకరా.. నరకరా' థీమ్‌ థియేటర్‌లో చూస్తే ఒళ్లుగగురు పొడవాల్సిందే.

శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మాతృకను 'అసురన్‌'లో కనిపించిన థీమ్‌ యథావిధిగా ఇందులోనూ కనిపిస్తుంది. సన్నివేశాల విషయంలో పెద్దగా మార్పుల జోలికి వెళ్లలేదు. మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. థియేటర్‌ను దృష్టిలో పెట్టుకుని నిడివి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది. ఇక దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి రీమేక్‌ను ఎంచుకున్నారు. అయితే, మార్పుల జోలికి అస్సలు పోలేదు. ‘అసురన్‌’ను ఫాలో అయిపోయారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా చూపించారు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని చోట్ల కథాగమనం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఓవరాల్‌గా సినిమా ఓకే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బలాలు: + వెంకటేశ్‌ నటన; + విరామ, పతాక సన్నివేశాలు; + సాంకేతిక వర్గం పనితీరు

బలహీనతలు: - నెమ్మదిగా సాగే కథనం; - ప్రారంభ, ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు

చివరిగా: 'నారప్ప' వెంకటేశ్‌ వన్‌మ్యాన్‌ షో

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చూడండి:

'బ్యాంకులు, అపార్ట్‌మెంట్లలో థియేటర్లు'

Venkatesh: 50 రోజులపాటు ఒకే డ్రెస్​లో ఉన్నా

Last Updated : Jul 20, 2021, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.