ETV Bharat / sitara

మరో 'దృశ్యం'తో రానున్న వెంకటేశ్?​ - narappa latest news

వెంకటేశ్​, మీనా ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం' సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇందుకు సీక్వెల్​గా మరో చిత్రం రానుందా అంటే.. అవునంటున్నాయి చిత్ర వర్గాలు.

venkatesh movie with drushyam sequel
వెంకటేశ్​
author img

By

Published : Jul 10, 2020, 7:40 AM IST

అగ్ర కథానాయకుడు వెంకటేశ్​కు మరో కథ దొరికినట్లేనా?. అన్ని అనుకున్నట్లు జరిగితే అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. ఇప్పటికే వెంకీ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న 'నారప్ప' ఒకటైతే.. మిగతా రెండు దర్శకులు తరుణ్‌ భాస్కర్‌, అనిల్‌ రావిపూడిల చిత్రాలు. వీటికి సంబంధించిన కథలు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో 'దృశ్యం 2' చేరే అవకాశం కనిపిస్తోంది.

మోహన్‌లాల్‌ - మీనా జంటగా నటించిన 'దృశ్యం' మలయాళంలో భారీ హిట్ అందుకుంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను.. తెలుగులో అదే పేరుతో వెంకటేష్‌, మీనాలతో పునర్నిర్మించగా ఇక్కడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సీక్వెల్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన అప్పట్లో రెండు చిత్రసీమల్లోనూ కనిపించింది.

ఇటీవల మలయాళంలో 'దృశ్యం 2' చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. ఇందులోనూ మోహన్‌లాల్​ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ సీక్వెల్‌ కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ సీక్వెల్‌ విజయవంతమైతే తెలుగులోనూ 'దృశ్యం 2' రీమేక్‌కి సన్నాహాలు మొదలయ్యే అవకాశముంటుంది. ఒకవేళ ఇదే జరిగితే వెంకటేష్‌కు మరో హిట్​ సినిమా దొరికినట్లే. ఇది కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్నది మలయాళ 'దృశ్యం-2' ఫలితంపైనే ఆధారపడి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.