ETV Bharat / sitara

చిరు సినిమాలో సాయి పల్లవి కీలక పాత్ర? - sai pallavi movie updates

తమిళ సూపర్​హిట్​ సినిమా 'వేదాళం'ను తెలుగులో రీమేక్​ చేయనున్నారు. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి నటించనున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రంలో సాయి పల్లవి కూాడా కనిపించనుందని సినీ వర్గాల్లో టాక్​.

sai pallavi
సాయి పల్లవి
author img

By

Published : Sep 11, 2020, 9:38 PM IST

తమిళ స్టార్​ అజిత్​ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం 'వేదాళం' తెలుగులో రీమేక్​ కానుంది. మెహర్​ రమేశ్​ దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఈ సినిమాలో మెగాస్టార్​ చిరంజీవి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవన్​ కళ్యాణ్ చేసిన ట్వీట్​తో దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. మరోవైపు చిరు పోస్ట్​ చేసిన కొత్త లుక్​.. ఈ సినిమా కోసమేనని నెట్టింట విపరీతంగా చర్చించుకుంటున్నారు.

ఇప్పుడు ఈ చిత్రంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్​. చిరంజీవి సోదరిగా నటించేందుకు రమేశ్​ ఆమెను సంప్రదించగా అంగీకరించినట్లు తెలుస్తోంది​. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

chiru
చిరంజీవి

మాతృకలో అజిత్​ సోదరిగా లక్ష్మీ మేనన్​ కనిపించి మెప్పించింది. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నారు చిరు. దీని తర్వాతే 'వేదాళం' షూటింగ్​లో పాల్గొననున్నారట. వీటితో పాటు దర్శకులు సుజీత్​, బాబీలతోనూ వరుస ప్రాజెక్టులు ఒప్పుకున్నారు.

  • Thank you Ramesh. Wishing you all the best for your forth coming film with Sri Chiranjeevi garu.🙏

    — Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.