మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న 'వాల్మీకి' పేరు మారింది. 'గద్దలకొండ గణేశ్' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. బోయ సామాజిక వర్గం అభ్యంతరమే ఈ మార్పుకు కారణమని వెల్లడించారు. అన్ని థియేటర్లలోనూ మార్చిన పేరుతో సినిమా రానుందని అన్నారు.
ఇప్పటికే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 'వాల్మీకి' సినిమా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. పేరు మార్చాలని వాల్మీకి సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తుండటమే ఇందుకు కారణం.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కి జే మేయర్ సంగీతమందించాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి...