రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు సురేందర్ రెడ్డిది విజయవంతమైన కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్ని దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి. 'నా పేరు సూర్య'తో దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. ఈ చిత్రం తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
'సైరా' లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి కూడా వరుణ్‌కి కథ వినిపించటానికి సిద్ధం అయ్యాడు. ఇప్పుడు ఈ రచయిత సురేందర్ రెడ్డికి దర్శకుడిగా పోటిపడుతున్నాడు. ఈ ఇద్దరూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి కథలు సిద్ధం చేసుకుని వినిపించారని సమాచారం.
ప్రసుత్తం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ దర్శకుడిగా మారిన రచయితకి అవకాశం ఇస్తాడా లేక 'సైరా'తో విజయాన్ని ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డి చేయబోయే చిత్రంలో నటిస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ జనాలు.
ఇవీ చూడండి.. సూపర్‌స్టార్ రజనీ కూతురిగా కీర్తి సురేశ్!