'కళంక్' నటుడు వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ను వివాహం చేసుకోనున్నాడు. కొన్నేళ్ల నుంచి వరుణ్ - నటషాలు ప్రేమించుకుంటున్నారు. ఆ మధ్య వరుణ్ తన పుట్టిన రోజైన ఏప్రిల్ 24న పెళ్లి విషయాన్ని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎటువంటి ప్రకటన చేయకపోగా.. ధావన్ - నటాషా ఒకటిగా ఉంటారా లేదా అనే అనుమానం మొదలైంది.
ఈ వార్తలన్నింటినీ పక్కన పెట్టి ఈ ఏడాది డిసెంబర్‌లోనే వరుణ్-నటాషాలు ఒకటి కానున్నారని తాజా సమాచారం. ఇరువురి బంధుమిత్రులు, మిగతా రంగాలకు చెందిన అతి కొద్దిమందిని మాత్రమే వేడుకకు ఆహ్వానిస్తున్నారట. వేదికగా సుందరమైన గోవా సముద్రతీరాన్ని ఎంచుకున్నారట. పెళ్లైన మరుక్షణమే తిరిగి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకుని అక్కడే రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా, ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్, దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ గతేడాది డిసెంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారు.