ETV Bharat / sitara

'వకీల్​సాబ్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అమెజాన్ ప్రైమ్​లో వకీల్​సాబ్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్​సాబ్' ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. తొలుత థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినా.. థియేటర్లు మూతపడటం వల్ల నిర్ణయం మార్చుకుంది చిత్రబృందం.

Vakeelsaab
వకీల్​సాబ్
author img

By

Published : Apr 27, 2021, 3:49 PM IST

Updated : Apr 27, 2021, 4:03 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం 'వకీల్​సాబ్'. దాదాపు మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్​ ఈ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర తన పవరేంటో మరోసారి చూపించాడు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడనేది ఇప్పటివరకు తెలియలేదు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రకటన చేసింది అమెజాన్ ప్రైమ్. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాత దిల్​రాజు స్పష్టం చేశారు. కానీ థియేటర్లు మూతపడటం వల్ల కొంచెం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించింది చిత్రబృందం.

Last Updated : Apr 27, 2021, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.