ETV Bharat / sitara

సంక్రాంతికి వకీల్​సాబ్ వర్సెస్ రాఖీభాయ్? - కేజీఎఫ్ చాప్టర్2 తాజా వార్తలు

కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పట్లో తెరచుకునే వీలులేదు. దీంతో చిత్ర నిర్మాతలు సంక్రాంతి సీజన్​పైనే నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ పండగ పోటీలో ఇప్పుడు రెండు పెద్ద చిత్రాలు నిలిచాయని తెలుస్తోంది. అందులో ఒకటి పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' కాగా, మరొకటి కన్నడ చిత్రం 'కేజీఎఫ్2'.

Vakeelsaab fight with KGF chapter 2
సంక్రాంతి బరిలో వకీల్​సాబ్ వర్సెస్ రాఖీభాయ్?
author img

By

Published : Sep 19, 2020, 8:18 AM IST

ఈసారి సంక్రాంతి సీజన్​లో సినిమాల పోటీ ఎక్కువగానే ఉండనుంది. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి 5 నెలలు అవుతోంది. పూర్తి స్థాయిలో మళ్లీ థియేటర్లు సంక్రాంతి వరకే అందుబాటులోకి వస్తాయని అందరూ భావిస్తున్నారు. దీంతో ఈ పండగకు తమ చిత్రాలు విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం రెండు పెద్ద చిత్రాలు సంక్రాంతి వార్​కు సిద్ధమవుతున్నాయట.

కొంత విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'వకీల్​సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కొద్ది భాగమే చిత్రీకరణ మిగిలి ఉంది. దీన్ని త్వరలోనే పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం.

అయితే ఇదే సమయానికి భారీ బడ్జెట్ చిత్రం 'కేజీఎఫ్ 2' రిలీజ్ కానుందని తెలుస్తోంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం మొదటి ఛాప్టర్​కు కన్నడ భాషలో ఎంతటి స్పందన వచ్చిందో తెలుగులోనూ అంతే రీతిలో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రిలీజైతే రెండు పెద్ద చిత్రాల మధ్య పోటీ నెలకొననుంది.

ఈ రెండు సినిమాలతో పాటు ఇంకా చాలా చిత్రాలు సంక్రాంతి సీజన్​పైనే గురిపెట్టాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్', 'క్రాక్', 'సీటీమార్', 'లవ్​స్టోరీ' చిత్రాలు ఈ పండగకే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.