తెలుగు చిత్ర పరిశ్రమను కరోనా వణికిస్తోంది. వైరస్ ఉద్ధృతితో ఇప్పటికే పలు చిత్రాలు వాయిదా పడ్డాయి. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కరోనాతో సతమతమవుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆయన నిర్మించిన 'వకీల్‌సాబ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఆ సినిమా వేడుకకు దిల్‌రాజు హాజరు కాలేకపోయారు. ఆ చిత్రబృందంలో కథానాయిక నివేదా థామస్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో గడుపుతున్నారు. చిత్ర పరిశ్రమలో పలు సినీ కార్యాలయాల సిబ్బందికి కరోనా సోకడం వల్ల నిర్మాణాలు కూడా ఆగిపోతున్నాయి. దర్శకుడు వి.ఎన్.ఆదిత్యతోపాటు మరో ఇద్దరు నిర్మాతలకూ కరోనా సోకినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: రాధేశ్యామ్: పండగలు ఎన్నో.. ప్రేమ ఒక్కటే!