ETV Bharat / sitara

ఆ నమ్మకాన్ని చిరంజీవి రెట్టింపు చేశారు: వైష్ణవ్​తేజ్

'ఉప్పెన' కథపై తన నమ్మకాన్ని పెద మామయ్య చిరంజీవి రెట్టింపు చేశారని హీరో వైష్ణవ్​తేజ్ అన్నారు. దీనితో పాటే పలు సంగతుల్ని ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

uppena movie news
చిరు వైష్ణవ్​తేజ్
author img

By

Published : Feb 8, 2021, 4:47 PM IST

Updated : Feb 8, 2021, 7:10 PM IST

ఈటీవీ భారత్​తో యువ హీరో వైష్ణవ్​తేజ్

మావయ్యలిచ్చిన ధైర్యంతోనే సినిమాల్లోకి వచ్చా..

‘‘నిజం చెప్పాలంటే.. యాక్టింగ్‌ అంటే మొదట్లో నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నా ప్రయాణం అటూ ఇటుగా ఉండేది. ‘ఓ.. పెద్దగా కష్టపడిపోయాం..’ అని చెప్పుకోవడానికి ఏం లేదు. అసలు నా కెరీర్‌ ఏంటో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. చిన్నప్పుడు సైంటిస్ట్‌ కావాలని అనుకునేవాడిని.. వ్యోమగామి.. త్రీడీ యానిమేటర్‌, జ్యువెల్లరీ డిజైనర్‌ ఇలా ఎన్నో అనుకున్నా. ఫొటోగ్రాఫర్‌ అవుదామని కోర్సు కూడా చేశా. అలా చాలా అనుకున్నా. ఏం చేయాలో అర్థం కావడంలేదని అమ్మతో చెప్తుండేవాడిని. తర్వాత డైరెక్టర్‌ అవుదామనుకున్నా.. ఒకసారి అన్నయ్య(సాయి తేజ్‌)తో కలిసి సినిమా సెట్‌కి వెళ్లాను. డైరెక్టర్‌ కావడం అంత సులభం కాదని అప్పుడు అర్థమైంది. రెండు, మూడేళ్లు అలా ఎంతో నాలో నేను పోరాటం చేశాను’’

‘‘డిగ్రీ పూర్తయ్యాక ఆర్మీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఒకసారి అమ్మతో చెప్పా. ఆర్మీకి అప్లై చేసే సమయంలో రెండుమూడు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. నేను చేయగలనో లేదోనని చెప్పా. బుచ్చిబాబు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. కానీ.. కథ విన్నాక నా అభిప్రాయం మారింది. ‘అవకాశం రాక చాలామంది ఎదురుచూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. ప్రయత్నించు’ అని మావయ్య వాళ్లు చెప్పడం గుర్తొచ్చి సినిమాకు ఓకే చెప్పాను’’

మొదటి సినిమా అలా చేయించారు..

‘‘నా మొదటి సినిమా ‘జానీ’. కల్యాణ్‌ మావయ్యకు నా కళ్లంటే చాలా ఇష్టం. ఆ విషయం మా అమ్మ చెబితే నాకు తెలిసింది. చిన్నప్పుడు నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అది తెలియని వయసు కదా..! బొమ్మలు కొనిచ్చి నాతో మొదటి సినిమా చేయించారు. ‘శంకర్‌దాదా’లో సినిమా కోసం నన్ను ఒక కుర్చీలో కూర్చోబెట్టి ‘కళ్లార్పకుండా.. ఎక్కువగా నవ్వకుండా’ ఉండు అని చెప్పారు.. అలా సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత ‘అందరివాడు’ కూడా అయిపోయింది’’

వాళ్లలా ఎన్నడూ ఊహించుకోలేదు

‘‘మావయ్యవాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ల డ్యాన్సులు, ఫైట్లు చూసి ఎంజాయ్‌ చేసేవాడిని.. కానీ, ఎన్నడూ వాళ్లలా నన్ను ఊహించుకోలేదు. సినిమా పోస్టర్లలో నా ఫొటో ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. నాకు దేనిమీదా ప్యాషన్‌ లేదు. ఏం చేసినా వందశాతం కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. రేపు ఇందులో నేను రాణించలేకపోయినా.. మరింత కష్టపడతానన్న నమ్మకం ఉంది’’

సినిమాలో గొప్పతనం ఆయనే..

‘‘ప్రేమకథ సినిమాలు చాలా వచ్చినా.. ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డ ప్రతీసారి కొత్తగానే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఒక చేపలు పట్టే వ్యక్తి తన జీవితంలోని ఎత్తుపల్లాలు.. ఇలా చాలా కొత్తగా చూపించాం. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సినిమా విడుదలయ్యాక నేను మీతో మాట్లాడతా. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి నటించడం మా అదృష్టం. సుకుమార్‌గారి మీద నమ్మకంతో కథ విన్నారు. మా బలం ఆయనే. సినిమా షూట్‌ అయిపోయే రోజు ఆయనే స్వయంగా డిన్నర్‌ ఇచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కెమెరా ముందు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని చాలా కొత్త విషయాలు చెప్పారు. అందరితో చాలా సరదాగా మాట్లాడేవారు. అంతపెద్ద స్టార్‌ అయినా.. అందరితో పాటు కలిసిపోవడం ఆయన గొప్పతనం. ఆయన వెళ్లేరోజు సినిమా యూనిట్లో అందరికీ తలా ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్లారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన.

కల్యాణ్‌ మావయ్యకు ‘ఉప్పెన’ కథ చెప్పలేదు. కానీ ట్రైలర్‌ చూశారు. అందరూ బాగా చేశారని మెచ్చుకున్నారు. ప్రయత్నించు బాగా కష్టపడి పనిచెయ్‌ అన్నారు.

ఈ అవకాశం అందరికీ రాదు

‘‘డైరెక్టర్‌ బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు.. ఇంతమంచి కథకు నేను న్యాయం చేయగలనా అనే సందిగ్ధత ఏర్పడింది. చిరంజీవి గారు కథ విని ‘కథ చాలా బాగుంది చెయ్‌రా’ అన్నారు. ఆ మాటలు నాలో ఆత్మవిశ్వాసం నింపాయి. ఈ సినిమాకు ఎంతోమంది గొప్పవాళ్లతో కలిసి పనిచేసే నాకు అవకాశం వచ్చింది. దేవిశ్రీప్రసాద్‌, మైత్రీమూవీమేకర్స్‌.. ఇలాంటి వారితో మొదటి సినిమా చేయడం నిజంగా నా అదృష్టం. అందరికీ ఇలాంటి అవకాశం రాదు’’

ఒక సినిమాకు ఇంతమంది కష్టపడతారా అనిపించింది

‘‘నేను నెలరోజుల పాటు యాక్టింగ్‌ తరగతులకు వెళ్లాను. వర్క్‌షాప్‌లు కూడా చేశాం. సిద్ధూ, కొండబాబు అనే చేపలుపట్టే వాళ్లతో రోజూ మాట్లాడేవాడిని. వర్క్‌షాపులకు వాళ్లు కూడా వచ్చేవాళ్లు. వాళ్లతో మాట్లాడి ప్రతీపదాన్ని ఎలా పలకాలి అని తెలుసుకొని అలా భాష నేర్చుకున్నా. నిజం చెప్పాలంటే సెట్లోనే ఎక్కువ నేర్చుకున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక సినిమాకు ఇంతమంది కష్టపడతారా అనిపించింది’’

సినిమా జనాల్లోకి దూసుకెళ్లిందంటే దానికి కారణం దేవిశ్రీ ప్రసాద్‌. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడతారు. డైరెక్టర్‌కు తగ్గట్లుగా ట్యూన్‌ చేసుకొని సంగీతం ఇవ్వడం చాలా కష్టమైన పని.

ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటా..

‘‘ప్రతి సినిమాను మొదటి సినిమాలాగే భావిస్తా. కరోనా వల్ల ఉప్పెన తర్వాత దాదాపు 6నెలలు సమయం వచ్చింది. దీంతో నేను నేర్చుకున్నదంతా మర్చిపోయాను. ‘ఉప్పెన’లో పాత్రకు.. క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీలోని పాత్రకు సంబంధం లేదు. నేను బాగా చేయగలుగుతున్నానా.. చేస్తున్నానా..? అని రోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటాను’’

యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్’ వంటి సినిమాలు చేయాలని ఉంది

ఎన్టీఆర్‌ సొంత తమ్ముడిలా చూసుకుంటారు

‘‘మన హీరోలను చూసినప్పుడు నాలో ఏదో ఒక ఫీలింగ్‌ వస్తుంది. ప్రతి సినిమా బెనిఫిట్‌ షో చూడాలని నాకూ ఉంటుంది. మొదటిరోజు మొదటి షో చూస్తేనే కిక్కు కదా.! ‘భరత్‌ అనే నేను సినిమా’లో మహేశ్‌బాబు హెలికాప్టర్‌ నుంచి దిగి వచ్చే సీన్‌ నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్‌గారి యాక్టింగ్‌ కూడా చాలా ఇష్టం. తారక్‌ అన్న చాలా సింపుల్‌గా ఉంటారు. నేను సాయి తేజ్‌ తమ్ముడినే కానీ.. అన్నతో ఉన్నట్లుగా నాతో ఉంటారో లేదో అనే అనుమానం నాలో ఉండేది. ఒకసారి నేను కాఫీషాప్‌లో కూర్చొని ఉన్నప్పుడు తారక్‌ అన్న నాకు ఫోన్‌ చేశారు.. ‘ఎవరూ..?’ అని అడిగాను. ‘నన్ను జూ.ఎన్టీఆర్‌’ అంటారు అన్నారు. ‘అన్నా చెప్పండి’ అనగానే.. వెంటనే ఇంటికి రా అన్నారు. నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. మనోజ్‌ అన్నకి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను హీరోగా చూడాలని వాళ్లెంతో కోరుకున్నారు.

క్లైమాక్స్‌ గురించి సోషల్‌ మీడియాలో వచ్చే వార్తల్లో నిజమెంత!

అవన్నీ నిజం కాదు. పుకార్లు మాత్రమే. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటివి వార్తలు రావడం బాధాకరం.

డైరెక్టర్‌ బుచ్చిబాబు చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ సినిమాకు ఎంతో కష్డపడి కథ రాశారు. డైలాగ్స్‌ బాగా రాయడమే ఆయన ప్రధాన బలం. ఆ మాట సినిమా చూసిన తర్వాత మీరే అంటారు.

కృతిశెట్టి చాలా కష్టపడుతుంది. వారం రోజుల్లోనే తెలుగు నేర్చుకుంది. కృతి, సేతుపతి.. ఈ ఇద్దరినీ చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ఖాళీ సమయంలో మేము సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఉంటే.. కృతి మాత్రం ఒక్కతే కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉండేది.

మీ అన్నయ్య (సాయిధరమ్‌తేజ్‌) ఎందుకు మీ సినిమా ప్రచారం చేయడం లేదు.?

అన్నయ్య సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన వేరే దగ్గర షూటింగ్‌లో ఉండటంతో రాలేకపోయారు. అన్నయ్య నన్ను చెప్పలేనంత ప్రేమిస్తారు.

డైరెక్టర్‌ ఏం చెప్పినా వెంటనే చేయాలి. ఎక్కువ టేక్స్‌ తీసుకోకుండా చేయాలని అనుకుంటా. ప్రతిరోజు నిద్రపోయేముందు నాలో నేను అనుకుంటూ ఉంటాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి:

Last Updated : Feb 8, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.