ETV Bharat / sitara

బయోపిక్స్​లో నటించడం ఆషామాషీ కాదు: ఊర్వశి - ఊర్వశి రౌతేలా న్యూస్

రియల్​ లైఫ్​ పాత్రల్ని వెండితెరపై పోషించడం చాలా కష్టమని నటి ఊర్వశి రౌతేలా చెప్పింది. వేరొకరి కథలో నటించడం చాలా పెద్ద బాధ్యత అని తెలిపింది.

Urvashi Rautela: Biopics are a great challenge for actors
బయోపిక్స్​లో నటించడం ఆషామాషీ కాదు: ఊర్వశి
author img

By

Published : Jan 21, 2021, 5:31 AM IST

నిజ జీవిత పాత్రల్లో నటించడం చాలా కష్టమని, సవాలు కూడకున్నదని నటి ఊర్వశి రౌతేలా చెప్పింది. ప్రస్తుతం 'ఇన్​స్పెక్టర్ అవినాష్' వెబ్ సిరీస్​లో రణ్​దీప్​ హుడా సరసన నటిస్తోంది. దాని గురించి విశేషాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Urvashi Rautela
రణ్​దీప్ హుడాతో ఊర్వశి రౌతేలా

"నిజజీవితంలోని ఓ వ్యక్తి పేర్రణతోనే ఈ సిరీస్​లో పూనమ్ మిశ్రా పాత్ర చేస్తున్నాను. సూపర్‌ కాప్‌ అవినాష్‌ మిశ్రా భార్యగా నటిస్తున్నాను. సాధారణ పాత్రల కంటే బయోపిక్స్​లో నటించడం ఆషామాషీ కాదు. వారి వ్యక్తిత్వాన్ని తెరపైకి తీసుకురావడం చాలా కష్టం. వేరొకరి కథను పోషించడం చాలా పెద్ద బాధ్యత. ఈ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం పూనమ్​తో చర్చించడం, వ్యక్తిత్వం, వేషధారణ, ప్రవర్తన లాంటి విషయాలు ఆమెకు దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తాను. నేను అవినాష్‌ను కలిసి ఆయన కుటుంబంతోనూ మాట్లాడాను" అని ఊర్వశి చెప్పింది.

'సింగ్ సాబ్ ది గ్రేట్​' అరంగేట్రం చేసిన ఊర్వశి.. ఆ తర్వాత కన్నడ, హిందీ చిత్రపరిశ్రమలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది 'వర్జిన్ భానుప్రియ' అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం తెలుగులో 'బ్లాక్ రోజ్' చిత్రంలో నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.