హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ‘ఉప్పెన’ సినిమాలో కథానాయికను ఎంపిక చేసింది చిత్రబృందం. ఆయన సరసన నూతన నటి కృతి శెట్టి నటించబోతున్నారు. ఆమె ఫొటోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది.
మే 25 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని పేర్కొంది చిత్రబృందం. కథానాయకుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తొలి సినిమా ఇది. ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్‌ను బట్టి ఈ సినిమాలో హీరో జాలరి పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు బాణీలు అందిస్తున్నాడు. ఇందులో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.