మెగాహీరో వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టిల పరిచయ చిత్రం 'ఉప్పెన'. ఈనెల 12న విడుదలైన సినిమా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వసూళ్లను సాధిస్తోంది. మూడో రోజు, తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకుంది. తద్వారా మూడో రోజు వసూళ్లతో 'బాహుబలి' ఫ్రాంచైజీతో పాటు మరో ఆరు చిత్రాల సరసన నిలిచింది. చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చి, ఈ ఘనత సాధించడం విశేషమనే చెప్పాలి!
ప్రేమకథకు సరికొత్త ముగింపుతో తీసిన ఈ సినిమా.. విశేషాదరణ పొందుతూ అలరిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమయ్యారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇవీ చదవండి: