ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ క్రేజీ ప్రోమో.. 'కేజీఎఫ్​ 2' అధీరా డబ్బింగ్ పూర్తి - కంగనా రనౌత్

RRR Trailer: కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రోమో, 'కేజీఎఫ్​ 2' డబ్బింగ్​ సహా పలు చిత్రాలకు సంబంధించిన విశేషాలున్నాయి.

RRR Trailer
ఆర్ఆర్ఆర్
author img

By

Published : Dec 7, 2021, 9:17 PM IST

RRR Trailer: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' నుంచి కొత్త ప్రోమో విడుదలైంది. డిసెంబర్ 9న టీజర్​ విడుదల కానున్న నేపథ్యంలో 'బ్రేస్ యువర్​సెల్ఫ్​ ఫర్ రామ్' అంటూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. భగభగ మండే మంటల్లోంచి రామ్​చరణ్​ నడుచుకుంటూ వస్తున్న వీడియో ట్రైలర్​పై ఆసక్తి పెంచుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రానుంది. రామ్​చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'లక్ష్య' మేకింగ్​..

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం 'లక్ష్య'. కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు, సచిన్‌ ఖేద్కర్‌ కీలక పాత్రలు పోషించారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. ఈ సినిమా మేకింగ్​ వీడియోను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. విలువిద్య నేపథ్య కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకుని, తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు నాగశౌర్య. డిసెంబర్‌ 10న విడుదల కానున్న ఈ చిత్రాన్ని.. నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పుస్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ స్వరాలు సమకూర్చారు.

అధీరా డబ్బింగ్ పూర్తి..

యశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2'. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. గతంలో వచ్చిన 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1' కి కొనసాగింపుగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో 'అధీరా' అనే పవర్​ఫుల్ పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్​ స్టార్ సంజయ్ దత్. ఆయన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసుకున్నారని చిత్రబృందం వెల్లడించింది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. రావు రమేశ్‌, రవీనా టాండన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

kgf 2 release date
'కేజీఎఫ్​ 2' డబ్బింగ్​ పనుల్లో సంజూ

ఫిబ్రవరి 14న కిచ్చా సుదీప్..

కన్నడ స్టార్​ కిచ్చా సుదీప్​ పాన్​ ఇండియా సినిమా 'విక్రాంత్​ రోణ'. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో రిలీజ్​ కానుంది. అనూప్​ భండారి దర్శకత్వం వహించారు.

vikrant rona release date
'విక్రాంత్ రోణ'లో సుదీప్

తేజస్ విడుదల తేదీ..

కంగన నటిస్తున్న వార్‌ చిత్రం 'తేజస్‌'(kangana ranaut tejas movie). ఈ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు సర్వేష్‌ మేవ్రా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2022 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.

tejas release date
'తేజస్​'లో కంగన

జెర్సీ పోస్టర్..

షాహిద్ కపూర్ 'జెర్సీ' సినిమా నుంచి కొత్త పోస్టర్​ రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ఇందులో మృనాల్ ఠాకుర్ హీరోయిన్​గా నటించింది. ఒరిజినల్​ తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డిసెంబర్ 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

jersey release date
'జెర్సీ'

ఇదీ చూడండి: Chiranjeevi: చిరంజీవా.. మజాకా! ఒకే నెలలో నాలుగు సినిమాల్లో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.