ETV Bharat / sitara

This Week Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

దసరా, దీపావళి సందర్భంగా కాస్త గుర్తింపు ఉన్న కథానాయకుల సినిమాలు వెండితెరపై సందడి చేశాయి. ఇక స్టార్‌ హీరోల సందడి అంతా డిసెంబరులోనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు చిన్న చిత్రాలు థియేటర్‌ల బాట పట్టనున్నాయి. అయితే, కొన్ని ఆసక్తికర సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌తో పాటు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేవో చూద్దామా!

author img

By

Published : Nov 15, 2021, 11:53 AM IST

cinema updates
సినిమా అప్డేట్స్​

ఈ వారం కూడా కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో కొన్ని థియేటర్​ మరికొన్ని ఓటీటీ వేదికగా రిలీజ్​ కానున్నాయి. అవేంటో చూసేద్దాం..

'రావణ లంక'లో ఏం జరిగింది?

క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’(Ravana Lanka). మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.ఎన్‌.ఎస్‌.రాజు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉజ్జల కుమార్‌ సాహా స్వరాలు సమకూరుస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఊరికి ఉత్తరాన..

నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఊరికి ఉత్తరాన’(ooriki utharana). విభిన్న ప్రేమ కథా చిత్రంగా సిద్ధమైన ఈ సినిమా నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లికాని అబ్బాయి పాత్రలో నరేన్‌ నటించారు. పలు పెళ్లి చూపులకు వెళ్లిన కథానాయకుడికి అన్ని చోట్లా నిరాశే ఎదురవుతుంది. ఈ క్రమంలో జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్‌లో చేరిన హీరో ఎలా ప్రేమలో పడ్డాడు? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అనేదే ‘ఊరికి ఉత్తరాన’ కథ. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటయ్య వనపర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌

అభినవ్‌ సర్దార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పీనట్‌ డైమండ్‌’. ఇప్పుడీ టైటిల్‌ను ‘రామ్‌ అసుర్‌’(Ram asur)గా మార్చారు. వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ ఐడియాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమని, ఇలాంటి కాన్సెప్ట్‌ ఇంత వరకు ఏ చిత్రసీమలోనూ రాలేదని, హీరో, నిర్మాత అభినవ్‌ సర్దార్‌ తెలిపారు. నవంబర్‌ 19న ‘రామ్‌ అసుర్‌’ థియేటర్‌లలో విడుదల కానుంది.

యువతి ప్రతీకారం ‘స్ట్రీట్‌ లైట్‌’

తాన్య దేశాయ్‌, అంకిత్‌రాజ్‌, కావ్య రెడ్డి, వినోద్‌కుమార్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘స్ట్రీట్‌లైట్‌’(Street Light). విశ్వ దర్శకత్వం వహిస్తున్నారు. మామిడాల శ్రీనివాస్‌ నిర్మాత. ఈ నెల 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘పగలు మంచివాళ్లుగా చెలామణి అవుతూ, రాత్రి కాగానే నేరాలకి పాల్పడే కొంతమంది కథ ఇది. ఈ ముఠాపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది ఆసక్తికరం. మంచి కాన్సెప్ట్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది’’ అని దర్శకుడు విశ్వ అన్నారు.

భావోద్వేగభరిత ‘పోస్టర్‌’

విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత సోనావానే ప్రధాన పాత్రల్లో టి. మహిపాల్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పోస్టర్‌’(Poster). టి.శేఖర్‌ రెడ్డి, ఏ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని యూఎఫ్‌ఓ సంస్థ నవంబరు 19న విడుదల చేయనుంది. ‘‘ఇది చిన్న సినిమాలలో పెద్ద చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’’ అని దర్శకుడు మహిపాల్‌ అన్నారు. ‘ఇది మన ఊరిలో మనకి తెలిసిన కథలాగే ఉంటుంది. అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు హీరో విజయ్‌ ధరన్‌.

పాతికేళ్ల కుర్రాడు.. అరవై ఏళ్ల మహిళ..

సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’(Savitri Wife Of Satyamurthy). చైతన్య కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అరవై ఏళ్ల మహిళకు.. పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే భర్త ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 19న థియేటర్స్‌లో విడుదల కానుంది. మహేంద్ర క్రియేషన్స్‌ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: సత్య కశ్యప్‌.

మోసపోయిన ప్రతి అబ్బాయి కథ

విక్కీ, నూరజ్‌, కీయా, లోహిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ లోన్లీ’(MR Lonely). హరీష్‌ కుమార్‌ దర్శకుడు. కండ్రేగుల ఆదినారాయణ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు? తర్వాత అతని జీవితం ఏమైంది? అన్నది ఈ చిత్ర కథాంశం. మూడు దశల్లో నడిచే ప్రేమకథ ఇది. అమ్మాయిల చేతిలో మోసపోయిన ప్రతి అబ్బాయి కథ. ‘అర్జున్‌ రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాల్లా యువతరానికి కచ్చితంగా నచ్చుతుందని చిత్ర బృందం చెబుతోంది.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే

అందరి నోటా ఒకటే మాట మహేశ్‌..

థియేటర్లలోనే కాదు, ఓటీటీ వేదికల్లోనూ విడుదల సందడి కనిపిస్తోంది. జీ5లో ఈ నెల 19 నుంచి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’(Oka Chinna Family Story) సిరీస్‌ ప్రసారం కాబోతోంది. నిహారిక కొణిదెల నిర్మించిన సిరీస్‌ ఇది. సంగీత్‌ శోభన్‌, సిమ్రన్‌ శర్మ, తులసి, నరేష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సంగీత్‌ శోభన్‌ చెప్పే డైలాగ్‌లు, మధ్యతరగతి నిరుద్యోగిగా ఆయన పలికించిన హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిరుద్యోగ యువకుడికి అనుకోకుండా అప్పుల బాధలు మీదపడితే.. పాకెట్‌ మనీకే ఇబ్బందిపడే అతడు రూ.25 లక్షలు కట్టాల్సి వస్తే.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ని రూపొందించారు.

ఒకే ఫోన్‌ నంబరు ఇద్దరు వినియోగిస్తే..

తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’(Adbhutham). మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. ప్రశాంత్‌ వర్మ కథ అందించారు. ఈ సినిమా నేరుగా డిజిటల్‌ మాధ్యమంలో విడుదలవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’లో నవంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి.. ఒకే ఫోన్‌ నంబరు ఉంటే ఏమవుతుందనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. కామెడీ, సస్పెన్స్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మరి తేజ, శివానీ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? ఒకే ఫోన్‌ నంబరును ఎలా వినియోగించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించిన ఈ చిత్రానికి రథన్‌ సంగీతం అందించారు.

అయ్యగారు కూడా వచ్చేస్తున్నారు!

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌, రొమాంటిక్‌ చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’(Most eligible bachelor). అక్టోబరు 15న వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. నవంబరు 19న ప్రముఖ ఓటీటీ వేదికలు ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

థ్రిల్లింగ్‌ 'ధమాకా'

బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో రామ్‌ మధ్వానీ తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. మృణాల్‌ ఠాకూర్‌, అమృత సుభాష్‌, వికాస్‌ కుమార్‌, విశ్వజీత్‌ ప్రధాన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అలరించేందుకు సిద్ధమైంది. నవంబరు 19న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీలో అందుబాటులోకి రానున్న మరికొన్ని చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌

  • నెవర్‌ బ్యాక్‌ డౌన్‌ (హాలీవుడ్‌) నవంబరు 16ద వీల్‌ ఆఫ్ టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) నవంబరు 19

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

  • క్యాష్‌ (హిందీ) నవంబరు 19
  • చురులీ (మలయాళం) నవంబరు 19
  • పొన్‌ మాణిక్‌వేల్‌(తమిళం) నవంబరు 19

సోనీ లివ్‌

  • యువర్‌ హానర్‌ (వెబ్‌ సిరీస్- సీజన్‌‌) నవంబరు 19

ఎంఎక్స్‌ ప్లేయర్‌

  • మత్స్యకాండ్‌ (తెలుగు వెబ్‌సిరీస్‌) నవంబరు 19

బుక్‌ మై షో

  • డోంట్‌ బ్రీత్‌2 (తెలుగు డబ్బింగ్‌) నవంబరు 15

నెట్‌ఫ్లిక్స్‌

  • టైగర్‌ కింగ్‌(వెబ్‌ సిరీస్‌-2) నవంబరు 17
  • బంటీ ఔర్‌ బబ్లీ 2(హిందీ ) నవంబరు 19
  • హెల్‌ బౌండ్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 19
  • కౌబాయ్‌ బే బోప్‌ (వెబ్‌ సిరీస్‌) నవంబరు 19

ఇదీ చూడండి: పూజాహెగ్డే బికినీ బ్రేక్​ఫాస్ట్​.. ఇలియానా, రకుల్​ హాట్​ పిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.