ETV Bharat / sitara

'ఖిలాడి' చిత్రంలో మలయాళీ నటుడు

author img

By

Published : Feb 2, 2021, 8:29 AM IST

Updated : Feb 2, 2021, 9:05 AM IST

రవితేజ, డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఖిలాడి'. ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలకపాత్రకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని వెల్లడించింది చిత్రబృందం.

Unni Mukundan to play pivotal role in Raviteja new movie
'ఖిలాడి' చిత్రంలో మలయాళీ నటుడు

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రంలో మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్‌ ఎంపికయ్యారు. ఈయన్ను ఆహ్వానిస్తూ 'ఖిలాడి' చిత్రబృందం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. 'వీర' తర్వాత రవితేజ-రమేష్‌ వర్మ కలయికలో తెరకెక్కుతున్న చిత్రమిది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి నాయికలు.

ఇప్పటికే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అర్జున్‌ ప్రతినాయకుడిగా ఎంపికయ్యారు. ఇటీవలే ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారు. తాజాగా ముకుందన్‌ని ఈ ప్రాజెక్టులోకి స్వాగతించారు దర్శకనిర్మాతలు. ఎన్టీఆర్‌ కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'జనతా గ్యారేజ్‌'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు ముకుందన్‌. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.. మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Last Updated : Feb 2, 2021, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.