ETV Bharat / sitara

Lockdown Effect: దొంగతనం చేసి దొరికిపోయిన తారలు - మూవీ న్యూస్

లాక్​డౌన్​ వల్ల ఉపాది కోల్పోయిన ఇద్దరు నటీమణులు దొంగతనం చేసి జైలు పాలయ్యారు. ఓ మహిళ దగ్గర రూ.3లక్షలకు పైగా సొమ్మును కాజేసి... పోలీసుల చేతికి చిక్కారు. ప్రస్తుతం అధికారులు వారిని విచారిస్తున్నారు.

actresses arrest
తారలు
author img

By

Published : Jun 19, 2021, 2:06 PM IST

కరోనా.. లాక్​డౌన్​ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి, తినడానికి తిండి లేక ఆకలికి అలమటించేలా చేసింది. ఈ ఆకలి బాధకు తట్టుకోలేక చివరికి ఇద్దరు నటీమణులు దొంగలుగా మారి కటకటాలపాలయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఇదీ జరిగింది

ప్రముఖ టీవీ షోలు 'సావ్​ధాన్​ ఇండియా', 'క్రైమ్​ పెట్రోల్'​లో నటించిన ఇద్దరు నటీమణులు లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయారు. చిత్రీకరణలు, అవకాశాలు లేకపోవడం వ్లల మే 18న ముంబయి ఆరే కాలనీలోనీ రాయల్​ పామ్​ ఏరియాలో ఓ ఇంట్లో పేయింగ్​ గెస్ట్​గా వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడే ఉంటున్న ఓ మహిళ దగ్గర ఉన్న రూ.3.28 లక్షల నగదు మాయమైంది. దీంతో ఆ నటులపై అనుమానంతో పోలీస్​ స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాళ్లే దొంగతనం చేశారని అక్కడి నిఘా కెమెరా ద్వారా నిర్ధరించారు. వారిని అరెస్టు చేసి దోచుకున్న సొమ్ములో రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: Anasuya: యాంకర్​తో అనసూయ గొడవ.. షో నుంచి బయటకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.