బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ట్విట్టర్ మరోసారి షాకిచ్చింది. రైతుల ఆందోళనపై ఆమె పోస్ట్ చేసిన రెండు ట్వీట్లను తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉండటం వల్లే వాటిని తొలగించినట్లు సదరు సంస్థ పేర్కొంది.
భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా పాప్ సింగర్ రిహానా ట్వీట్ చేయడం వల్ల ఆమెపై కంగన తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ క్రమంలో రైతులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ కంగన ట్వీట్ చేసింది.
అలానే రైతుల ఆందోళనకు మద్దతిస్తున్న నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్‌ను ఖలీస్థానీ అని చెప్పింది. కంగన ట్వీట్లపై అభ్యంతరాలు వ్యక్తమవడం వల్ల వాటిని ట్విటర్ తొలగించింది.
గతంలోనూ కంగన ఖాతాను ట్విటర్ కొన్ని గంటల పాటు నిలిపివేసింది. ఓ టీవీ షోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
ఇది చదవండి: రైతులకు మద్దతుగా రిహాన్న ట్వీట్.. మండిపడ్డ కంగన