ఈ ఏడాది వరుసగా నటీనటుల మరణాలు అభిమానులను కుంగదీస్తున్నాయి. బాలీవుడ్లో బుల్లితెర నటి లీనా ఆచార్య కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతూ, శనివారం మృతి చెందారు. 30 ఏళ్ల వయసులోనే ఈమె మరణించడం సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీప్రముఖులు ఈమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
ఏడాది కాలం నుంచి ఆచార్య, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొంతకాలం క్రితం రెండు కిడ్నీలు పాడవడం వల్ల తన తల్లి ఓ కిడ్నీను ఈమెకు దానం చేశారు. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. దీంతో లీనా మృతిచెందారు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన లీనా.. పలు ధారావాహికల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 'సేట్‌జీ', 'ఆప్ కే ఆ జానే సే', మేరీ హానీ కారక్ బీవీ' లాంటి సీరియల్స్ ఈమెకు పేరు తెచ్చిపెట్టాయి. చివరగా 'క్లాస్ ఆఫ్ 2020' వెబ్‌సిరీస్‌లో నటించారు.
ఇదీ చూడండి : కొంపముంచిన డైటింగ్.. కిడ్నీ ఫెయిల్యూర్‌తో నటి మృతి