ప్రియాంక చోప్రా.. వివాదాలను వెనకేసుకొని తిరుగుతుందో లేక వివాదాలే ఆమెను వెంటాడుతాయో తెలియదు... కానీ తరచుగా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరో ఫొటో నెట్టింట పెను దుమారాన్ని రేపుతోంది.
ఇంతకీ అంతగా రచ్చ జరగాల్సిన అంశం ఆ ఫొటోలో ఏముంది అనుకుంటున్నారా? తన తల్లి మధు చోప్రా, భర్త నిక్ జొనాస్‌లతో కలిసి ధూమపానం చేస్తూ కనిపించింది. ఈ జులై 18న తన 37వ పుట్టినరోజు సందర్భంగా మియామీ సముద్ర తీరంలో పడవలో జరుపుకున్న బర్త్‌డే వేడుకలోనిదీ చిత్రం.
ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా. అయితే గుప్పుగుప్పుమంటూ పొగ ఊదేస్తున్న ఈ గ్లోబల్ స్టార్, గతంలో ‘దీపావళి నాడు టపాసులు కాల్చకండి, పర్యావరణానికి హాని కలిగించకండి’ అని ట్వీట్స్ చేసింది. మరో సందర్భంలో ‘పొగతాగడం చాలా అసహ్యమైన అలవాటు’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది.
ఇప్పుడిలా బహిరంగంగా పొగతాగుతూ నెటిజన్లకు దొరికిపోయింది. ఈ కారణంతో ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నీతులు చెప్పడానికే ముందుంటావు కానీ వాటిని పాటించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మీమ్స్ రూపొందించి జోక్స్ వేస్తున్నారు.
ఇది చదవండి: స్విమ్ సూట్‌తో టాప్ ర్యాంక్ కొట్టేసిన ప్రియాంక