మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడీ విషయాన్ని స్వయంగా ఆ నటే ఖరారు చేసింది. ఇంతకీ ఎవరామె?
సినీ పరిశ్రమకొచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్రిషకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు ట్వీట్స్ చేశారు. ఓ సినీ విశ్లేషకుడు ఈ ఏడాది.. త్రిష మూడు సినిమాలతో అలరించబోతున్నారని ట్వీట్ చేశాడు. మణిరత్నంతో 'పొన్నియిన్ సెల్వన్', మోహన్‌లాల్‌తో ఓ సినిమా, చిరంజీవి-కొరటాల సినిమాలో ఆమె నటించబోతున్నారని పేర్కొన్నాడు. దీనిని రీట్వీట్ చేసింది త్రిష. నిజమే అంటూ విక్టరీ ఏమోజీతో పాటు #2020 హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. చిరు-త్రిష.. ఇంతుకు ముందు 'స్టాలిన్'లో కలిసి నటించారు.
ఇది చదవండి: మసాజ్ 'ల్యాండ్'లో మ్యూజిక్ సిట్టింగ్స్