మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 'లూసిఫర్' రీమేక్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓ స్టార్ హీరోయిన్ చిరు సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా భామ?
చిరంజీవి 'స్టాలిన్'లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు త్రిష. 2006లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కొరటాల శివ 'ఆచార్య'లో తొలుత త్రిషనే హీరోయిన్గా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
'లూసిఫర్' రీమేక్‌లో నయనతారను కథానాయికగా అనుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నయన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని.. దీంతో, ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు. త్రిష కూడా 'లూసిఫర్' రీమేక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇది చదవండి: 'లూసిఫర్' అంటే? రీమేక్‌లో ఈ మార్పులు చేస్తారా?