అమెరికాలో బాలీవుడ్ సినిమాలు విడుదలవడం కొత్తేం కాదు. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రచారం చేయడమే అరుదు. ఆ ఫీట్‌ను ఫర్హాన్ అక్తర్ బీట్ చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బిల్బోర్డ్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
'అప్పుడు మొదటిసారి నేను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు వెళ్లా. అక్కడ పెద్దపెద్ద బిల్‌బోర్డ్స్ చూశా. నా సినిమా ప్రచారం కూడా ఇలా చేస్తే బాగుండు అనుకున్నా. ఆ కల నిజమైంది. ఇదంతా అమెజాన్ ప్రైమ్ వీడియో చలవే' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ సినిమా కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీ నిబద్ధత, పట్టుదల చాలా మెచ్చుకోదగినది. కొంచెం ముందో, వెనకో ప్రపంచం నీ ప్రతిభను గుర్తిస్తుంది. ఆరోజు కోసం నేను ఆతృతతో ఎదురుచూస్తున్నా' అంటూ పలువురు ఇన్‌స్టాలో ఫర్హాన్ పోస్ట్‌పై కామెంట్ చేస్తున్నారు.
జులై 16న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 'తుఫాన్' రిలీజ్ కానుంది.
ఇదీ చదవండి : నవ్విస్తోన్న'మిమీ' ట్రైలర్.. మీరూ ఓ లుక్కేయండి