ETV Bharat / sitara

సినీఫక్కీలో స్టార్​ హీరో కారు చోరీ - టామ్​ క్రూజ్​ కారు చోరీ

'మిషన్​: ఇమ్​పాజిబుల్​ 7' షూటింగ్​ సమయంలో యాక్షన్​ హీరో టామ్​ క్రూజ్​ లగ్జరీ కారు 'బీఎమ్​డబ్ల్యూ ఎక్స్​ 7'ను సినీఫక్కీలో దొంగిలించారు. దీంతో పాటు ఆ వాహనంలో ఉన్న వేల పాండ్లు విలువైన లగేజ్​ బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు.

tom cruise
టామ్​ క్రూజ్​
author img

By

Published : Aug 28, 2021, 4:38 PM IST

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ లగ్జరీ కారు 'బీఎమ్​డబ్ల్యూ ఎక్స్​ 7' చోరీకి గురైంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'మిషన్​: ఇమ్​పాజిబుల్​ 7' షూటింగ్​ సమయంలో ఆయన వాహనాన్ని ఓ బడా హోటల్​ ముందు పార్కింగ్​ చేయగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సినీఫక్కీ తరహాలో దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో ఉన్న వేల పౌండ్లు విలువైన లగేజ్​ బ్యాగ్​ను తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన క్రూజ్​కు విపరీతమైన కోపం వచ్చిందట. ఈ సంఘటనను అక్కడి ఓ వార్తా సంస్థ తెలిపింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకున్నారు. కారులో ఉన్న ఎలక్ట్రానిక్​ ట్రాకింగ్​ డివైస్​ ద్వారా వాహనాన్నికనుగొన్నారు. కానీ అందులో ఉన్న లగేజ్​ బ్యాగ్​ను ఇంకా స్వాధీనం చేసుకోలేదు.

tom cruise
టామ్​ క్రూజ్​

'మిషన్​ ఇంపాజిబుల్​' సిరీస్​ నుంచి ఇప్పటివరకు ఆరు భాగాలు వచ్చాయి. ఏడో భాగం సెట్స్‌పై ఉంది. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్‌ క్రూజ్‌ (Tom Cruise) ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్‌ డ్రామాగా తీస్తున్న ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వింగ్ రేమ్స్, రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హేలే అట్వెల్, హెన్రీ సెర్నీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి: సిబ్బందిని తిట్టిన హీరో.. తప్పుకున్న ఐదుగురు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.