హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్.. అంతరిక్షంలో సాహసాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌తో ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నాడు. ప్రాజెక్టు విషయమై, అంతరిక్షంలో షూటింగ్ జరిపేందుకు 'నాసా'తో చర్చలు జరుపుతున్నారని టాక్. పూర్తిస్థాయి యాక్షన్ ఎడ్వెంచర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
57 ఏళ్ల టామ్.. ఇప్పటికే 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో లెక్కలేనన్ని సాహసాలు చేసి, ప్రేక్షకులను విస్మయానికి గురిచేశాడు. బూర్జ్ ఖలీపాపై స్టంట్ సీన్, హెలికాప్టర్‌ను పట్టుకుని వేలాడే సన్నివేశాలు లాంటివి ఇతడు చేసిన వాటిలో ఉన్నాయి. క్రూజ్ నటించిన 'టాప్‌గన్: మేవ్రిక్' విడుదల కావాల్సి ఉంది. దీనితోపాటే 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో మరో రెండు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.