తెరపై కదిలే బొమ్మలతో కథలు చెప్పాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి సినిమాలతో మన ప్రయాణం మొదలైంది. మూకీల నుంచి టాకీల వరకూ, బయో స్కోప్‌ల నుంచి ఐమాక్స్ల వరకూ సాగిన ఫిల్మ్ జర్నీ.. ప్రస్తుతం అంతరిక్షం వైపు దూసుకెళుతోంది. యాక్షన్ సన్నివేశాలు చేయటంలో ఇప్పటివరకు ఎన్నో సాహసాలు చేసిన హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్.. అంతరిక్షంలో నటించిన తొలి హీరోగా చరిత్ర సృష్టించబోతున్నాడు.
టామ్ క్రూజ్‌తో అమెరికన్ మేడ్, ఎడ్జ్ ఆఫ్ టుమారో సినిమాలు తీసిన డగ్ లీమన్... ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2021 అక్టోబరులో మొదలయ్యే ఈ కొత్త సినిమా చిత్రీకరణ భూమిపై మాత్రం కాదు. అవనికి ఆవల ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ప్రఖ్యాత ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ ప్రాజెక్టుకు సంబంధించి బయటకు వచ్చిన ట్వీట్.. సినీ ప్రియులకు అత్యంత ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలియజేసింది.
-
So its confirmed that @CommanderMLA is flying the @Axiom_Space @SpaceX #CrewDragon tourist mission with Director @DougLiman & Tom Cruise. One seat still to be filled. They are to launch in October, 2021. pic.twitter.com/dn6SLvCOGz
— Space Shuttle Almanac (@ShuttleAlmanac) September 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">So its confirmed that @CommanderMLA is flying the @Axiom_Space @SpaceX #CrewDragon tourist mission with Director @DougLiman & Tom Cruise. One seat still to be filled. They are to launch in October, 2021. pic.twitter.com/dn6SLvCOGz
— Space Shuttle Almanac (@ShuttleAlmanac) September 19, 2020So its confirmed that @CommanderMLA is flying the @Axiom_Space @SpaceX #CrewDragon tourist mission with Director @DougLiman & Tom Cruise. One seat still to be filled. They are to launch in October, 2021. pic.twitter.com/dn6SLvCOGz
— Space Shuttle Almanac (@ShuttleAlmanac) September 19, 2020
ఇప్పటికీ పేరు ఖరారు కాని, కథాంశం ఏంటో స్పష్టం గా తెలియని.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నిర్మాణానికి ప్రయాణ సౌకర్యాలు అందించడం ద్వారా అంతరిక్ష పర్యాటకంలో సరికొత్త అధ్యాయానికి స్పేస్ ఎక్స్ శ్రీకారం చుడుతున్నట్టు, అంతరిక్ష పరిశోధన కేంద్ర సమాచారాన్ని అందించే స్పేస్ షటిల్ అల్మనాక్ ట్వీట్ చేసింది. ఇదే సమాచారాన్ని దర్శకుడు డగ్ లీమన్ ట్విట్టర్ లో రీ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2002లో స్పేస్ ఎక్స్ సంస్థ స్థాపించిన ఎలన్ మస్క్.. నాసాతో కలిసి అంతరిక్ష ప్రయాణాలపై పరిశోధనల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లోని వ్యోమగాములకు అవసరమైన సరుకులు రవాణా చేయడం దగ్గర నుంచి.. భవిష్యత్తులో విశ్వంలో మరెక్కడైనా మానవ మనుగడకు ఆస్కారం ఉంటే వాటిని చేరుకునేందుకు హాల్ట్‌గా ఉపయోగపడే రోదసిలోని అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంపై స్పేస్ ఎక్స్ విశేషమైన కృషి చేస్తోంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా చేపడుతున్న తమ ప్రాజెక్టులో భాగంగా.. టామ్ క్రూజ్ తొలి అంతరిక్ష చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రావడం వల్ల ఇటు స్పేస్ ఎక్స్ అటు నాసా తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
అన్నీ అనుకూలిస్తే.. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా 2021 అక్టోబరులో టామ్ క్రూజ్, చిత్ర దర్శకుడు డగ్ లీమన్ అంతరిక్షానికి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది విజయవంతమైతే అంతరిక్షంలో చిత్రీకరణ జరుపుకొన్న తొలి సినిమాగా పేరు పెట్టని రికార్డు నెలకొల్పడం సహా టామ్, లీమన్ల పేర్లు సినీ చరిత్రలో నిలిచి పోతాయి.