ETV Bharat / sitara

ఆసక్తి పెంచే టైటిల్స్​తో వచ్చేస్తున్న యువ హీరోలు! - సాయి తేజ్​ కొత్త సినిమా

టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే.. ఆ సినిమా చూసేందుకు అంతగా ఆసక్తి చూపిస్తారు ప్రేక్షకులు. తాజాగా.. యువహీరోలు సాయితేజ్​, నాగశౌర్య.. నటిస్తున్న కొత్త చిత్రాలకు విభిన్నమైన పేర్లు వినిపిస్తున్నాయి.

tollywood young heroes naga shaurya and sai tej are coming with intresting titles
ఆసక్తి పెంచే టైటిల్స్​తో వచ్చేస్తున్న యువ హీరోలు!
author img

By

Published : Nov 3, 2020, 8:25 AM IST

సినిమాకి పేరు పెట్టడం వెనక ఎన్నెన్నో కసరత్తులు జరుగుతుంటాయి. పేరు ఎంత ఆకర్షణీయంగా ఉంటే, ఆ సినిమా అంతగా ప్రేక్షకుల మదిలోకి వెళుతుంది. అదే సమయంలో ఆ టైటిల్.. కథని ప్రతిబింబించేలా ఉండాలి. తాజాగా యువ హీరోలు సాయితేజ్‌, నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరి అవే ఖరారవుతాయో లేదో తెలియదు. కానీ, ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోల సినిమాలకి సంబంధించి ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి.

సాయి తేజ్‌ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'రిపబ్లిక్‌' అనే పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరో యువ హీరో నాగశౌర్య చిత్రానికి 'వరుడు కావలెను' అనే పేరు ప్రచారంలో ఉంది. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రీతూవర్మ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి:వెంటాడే 'గతం'... భయపెట్టే వర్తమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.