ETV Bharat / sitara

అడవి బాట పట్టిన టాలీవుడ్ అగ్ర హీరోలు - రానా అరణ్య

క్లాస్​ కథలతో అభిమానులను అలరించిన టాలీవుడ్ అగ్రహీరోలు.. ఇటీవల కాలంలో అడవి నేపథ్యంలో సాగే కథల్లో నటిస్తున్నారు. ఇంతకీ వారెవరు? అవి ఏ చిత్రాలంటే?

అడవి బాట పట్టిన టాలీవుడ్ అగ్ర హీరోలు
టాలీవుడ్ హీరోలు
author img

By

Published : Aug 26, 2020, 7:05 AM IST

'అడవి దొంగ', 'అడవి రాముడు', 'అడవి దొర', 'అడవి రాజా', 'అడవి సింహాలు', 'బొబ్బిలిరాజా', 'అడవి'... ఇలా అడవి చుట్టూ సాగిన తెలుగు సినిమాలెన్నెన్నో. చెట్టు చేమలు, కొండ కోనల మధ్యే కథను నడుపుతూ మాస్‌ ప్రేక్షకుల్ని అలరించారు దర్శకులు. కాలక్రమంలో ట్రెండీ కథలదే హవా కావడం వల్ల ఆ నేపథ్యంలో సినిమాలు రావడం తక్కువైంది. ఒకట్రెండు సన్నివేశాలు మినహా పూర్తిస్థాయిలో అడవి చుట్టూ సాగిన సినిమాలు తక్కువ. కానీ ఇప్పుడు మరోసారి మన హీరోలు అడవి బాట పట్టారు. కొత్తదనం కోసం దర్శకులు ఆ నేపథ్యంలో కథల్ని విరివిగా తయారుచేస్తున్నారు.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న 'ఆచార్య'లోనూ అటవీ నేపథ్యం ఉంటుందని సమాచారం. ఇలా అడవి బాట పట్టిన మన హీరోలు ఎలాంటి వినోదం అందిస్తారో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ నేపథ్యం అలరించిందంటే ఈ బాటలో మరికొన్ని కథలు ప్రయాణం చేస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

chiru acharya
ఆచార్య సినిమాలో చిరంజీవి

ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' దేశభక్తి, స్నేహం ప్రధానంగా సాగే కథని సమాచారం. కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలతో ఓ కల్పిత గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అల్లూరి, కొమరం... ఈ ఇద్దరూ మన్యం వీరులే. దీంతో ఈ కథ ఎక్కువగా అడవుల నేపథ్యంలోనే ఉండనుందని సమాచారం.

RAM CHARAN NTR
రామ్​చరణ్ ఎన్టీఆర్

రానా కథానాయకుడిగా నటించిన 'అరణ్య'.. దట్టమైన అడవుల నేపథ్యంలో నడిచే కథే. గజరాజుల మధ్యే పుట్టి పెరిగిన అరణ్య వాటి కోసం, అడవుల కోసం ఏం చేశాడనేది తెరపైనే చూడాలి.

rana aranya
అరణ్య సినిమాలో రానా

క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ - రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే మొదలైంది. ఇదీ అడవుల నేపథ్య కథ అని సమాచారం. ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 40 రోజుల్లోనే దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగారు క్రిష్‌.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప'.. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో తీస్తున్నారు. శేషాచలం అడవుల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్‌ తన ఆహార్యాన్ని మార్చుకున్నారు.

allu arjun in pushpa
పుష్పలో అల్లు అర్జున్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.