భారీ వర్షాలు, ఉద్ధృత వరదలతో అస్తవ్యస్తమైన భాగ్యనగరాన్ని ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్‌కు సాయంగా పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందజేశారు. తమ వంతు బాధ్యతగా విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రూ.25 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
మంత్రి కార్యాలయానికి వచ్చిన రామ్.. వరద బాధితుల కోసం తీసుకుంటున్న చర్యలు గురించి కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నందుకు మంత్రి కేటీఆర్.. రామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఎన్ శంకర్ కూడా లక్ష రూపాయల విరాళాన్ని కేటీఆర్‌కు అందించారు.
- ఇదీ చదవండి : భాగ్యనగరానికి అండగా మేము సైతమంటూ...