ETV Bharat / sitara

అలరిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్‌.. హిందీలో రామ్​-నితిన్​ హవా! - నితిన్​ రికార్డు

Tollywood Latest News: శర్వానంద్​-రష్మిక జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్​ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. టైటిల్‌కు తగ్గట్టే మహిళలకు ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్‌ హీరోలు రామ్‌ పోతినేని, నితిన్‌ ఇక్కడివారినే కాదు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. వారి ఆదరణతో యూట్యూబ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పారు.

cinema updates
'ఆడవాళ్లు మీకు జోహార్లు ' ట్రైలర్‌
author img

By

Published : Feb 27, 2022, 7:53 PM IST

Tollywood Latest News: శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్‌ తిరుమల దర్శకత్వ వహించారు. ఈ సినిమాను మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని పాటలు, టీజర్‌లను విడుదల చేయగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. టైటిల్‌కు తగ్గట్టే మహిళలకు ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. ఖుష్బూ, రాధిక, ఊర్వశి వంటి సీనియర్‌ నటీమణులు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ తారలు కనిపించిన ప్రతి ఫ్రేమూ చూడముచ్చటగా ఉంది. శర్వానంద్‌, రష్మిక జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హిందీలో రామ్​- నితిన్​ హవా..

టాలీవుడ్‌ హీరోలు రామ్‌ పోతినేని, నితిన్‌ ఇక్కడివారినే కాదు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. వారి ఆదరణతో యూట్యూబ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పారు. తెలుగులో మంచి టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు ఇతర భాషల్లో డబ్‌ అయి, యూట్యూబ్‌ వేదికగా విడుదలవుతుంటాయనే విషయం తెలిసిందే. అలా రామ్, నితిన్‌ నటించిన చాలా సినిమాలు హిందీలోకి డబ్‌ అయ్యాయి. వీటికి ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నితిన్‌ సినిమాలన్నీ కలిపి 2.3 బిలియన్‌కిపైగా (200 కోట్లకుపైగా) వీక్షణలు సొంతం చేసుకోగా.. రామ్‌ చిత్రాలు 2 బిలియన్‌ వ్యూస్‌ దక్కించుకున్నాయి. హిందీ ప్రేక్షకుల్లో ఈ ఇద్దరి హీరోలకు ఎంతటి క్రేజ్‌ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. యూట్యూబ్‌ వేదికగా తెలుగు సినిమాలకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. దాంతో అటు నితిన్‌ అభిమానులు, ఇటు రామ్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నితిన్‌ ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' అనే పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమాలో నటిస్తున్నారు. ఎం.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక. రామ్‌.. 'వారియర్‌' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రానికి లింగుస్వామి దర్శకుడు. రామ్‌ సరసన కృతిశెట్టి సందడి చేయనుంది. మరోవైపు, దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ పాన్‌ ఇండియా చిత్రం ప్రకటించారు రామ్‌. ఈ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని నేరుగా పలకరించనున్నారు.

ఇదీ చూడండి : 'భీమ్లా' గ్రాండ్​ పార్టీ​.. విజయ్​ కొత్త సినిమా అప్డేట్​.. శ్రుతికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.