ETV Bharat / sitara

సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ! - నభా నటేశ్ సంక్రాంతి

మరో వారం రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతుంది. ఈ పండగకంటే ముందే సినీ అభిమానులకు థియేటర్లో సినిమాల సందడి షూరూ కానుంది. ప్రతి ఏడాది సంక్రాంతిలాగే ఈసారి కూడా పలు చిత్రాలు పండగ సీజన్​లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి పండగ సినిమాలు అనూహ్యంగానే ఖరారైనా.. వాటిలో హీరోలు నలుగురే అయినా.. అందగత్తెలు చాలా మందే థియేటర్లకి రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నారు.

Tollywood Heroins entertaining this Sankranti
సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!
author img

By

Published : Jan 8, 2021, 9:55 AM IST

సంక్రాంతి వస్తోందంటే చాలు.. అభిమాన కథానాయకుడి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. తొలి రోజు తొలి ఆటతోనే సినిమాల్ని ఆస్వాదించేందుకు సిద్ధమైపోతుంటారు. పండగ సినిమాలంటే అందులో ప్రత్యేకమైన అంశాలు పుష్కలంగానే ఉంటాయి. కథానాయకులకి దీటుగా.. నాయికల పాత్రల్నీ ప్రత్యేకంగానే డిజైన్‌ చేస్తుంటారు. ఈసారి పండగ సినిమాలు అనూహ్యంగానే ఖరారైనా.. వాటిలో హీరోలు నలుగురే అయినా.. అందగత్తెలు చాలా మందే థియేటర్లకి రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నారు. శ్రుతిహాసన్, మాళవికా శర్మ, నివేథా పేతురాజ్, అమృతా అయ్యర్, హెబ్బా పటేల్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్, మాళవికా మోహనన్‌.. వీళ్లంతా సంక్రాంతి భామలే.

రవితేజతో కలిసి..

శ్రుతిహాసన్‌ మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించబోతోంది. 'కాటమరాయుడు' తర్వాత విరామం తీసుకున్న ఆమె, మళ్లీ రవితేజతో జోడీకట్టి 'క్రాక్‌'లో నటించింది. ఆ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. 'బలుపు' తర్వాత రవితేజ - శ్రుతి కలిసి చేసిన సినిమా ఇదే. శ్రుతి సంక్రాంతి భామ కావడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఆమె నటించిన 'అనగనగా ఓ ధీరుడు' కూడా సంక్రాంతి సందర్భంగానే విడుదలైంది. శ్రుతికి తోడు మరో ప్రత్యేక అందం ఆకర్షించబోతోంది. 'భూమ్‌ బద్దల్‌' అంటూ సాగే ప్రత్యేక గీతంలో అప్సరా రాణి ఆడిపాడింది.

Tollywood Heroins entertaining this Sankranti
శ్రుతి హాసన్

అప్సరా రాణి

అందాలే అందాలు

'రెడ్‌' సినిమాలో ఇద్దరు రామ్‌లు కనిపించబోతున్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. హీరో ఇద్దరిలా కనిపిస్తాడంటే, కథానాయికలు కూడా ఇద్దరు ఉంటారని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో నలుగురు భామలు సందడి చేయబోతున్నారు. నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ ప్రధాన నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్‌ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఈ కథానాయికల్లో నివేదా పేతురాజ్‌ గతేడాది సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' సినిమాతో విజయాన్ని అందుకుంది.

నివేథా పేతురాజ్

మాళవిక శర్మ

అల్లుడితో ముగ్గురు

ఈసారి సంక్రాంతి అల్లుడిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మురిపించబోతున్నారు. ఆయన హీరోగా నటించిన 'అల్లుడు అదుర్స్‌'లోనూ ముగ్గురు ముద్దుగుమ్మలున్నారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్‌ నాయికలుగా నటించగా, ప్రత్యేక గీతంలో మోనాల్‌ గజ్జర్‌ ఆడిపాడింది. వీరిలో అనుకి ఇది రెండో సంక్రాంతి సినిమా. ఆమె ఇదివరకు 'అజ్ఞాతవాసి'తో సందడి చేసింది.

అను ఇమ్మాన్యుయేల్

నభా నటేశ్

ఏటా సంక్రాంతి బరిలో ఓ అనువాద చిత్ర తప్పకుండా ఉంటుంది. ఈసారి పండగకి తమిళ హీరో విజయ్‌ నటించిన 'మాస్టర్‌' విడుదలవుతోంది. ఇందులో మాళవిక మోహనన్‌ కథానాయిక. ఇదివరకు సంక్రాంతికే విడుదలైన 'పేట'లో మాళవిక మోహనన్‌ నటించింది.

మాళవిక మోహనన్

ఇవీ చూడండి: జ్వాల కన్న జ్వాలాపుత్రుడు.. ఈ రాకీభాయ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.