ETV Bharat / sitara

వెండితెర: తెల్లదొరలపై.. తెలుగు వీరుల పోరు - british rule in telugu cinemas

ప్రేక్షకుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తూ.. స్ఫూర్తి నింపే చిత్రాలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. హీరోయిజానికి సరికొత్త శక్తిని అద్దుతూ ప్రేక్షకుల్లో దేశభక్తిని పెంపొందించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలనే అందుకున్నాయి. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటించిన 'సైరా' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అలాంటి తెలుగు సినిమాలు మీకోసం.

సినిమా
author img

By

Published : Oct 1, 2019, 9:06 AM IST

Updated : Oct 2, 2019, 5:15 PM IST

కథానాయకులు ఎన్ని రకాల హీరో పాత్రలు చేసినా.. వాళ్లు సినీప్రియుల మదిలో రియల్‌ హీరోలుగా చిరస్థాయిగా మిగలడానికి చేసే తొలి పని ఏంటో తెలుసా..!
తెల్లవాడి గుండెల్లో కసిగా కత్తి దింపడమే.. ఇది వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములా.. హీరోయిజానికి ఓ సరికొత్త శక్తిని అద్దుతూ.. ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలిస్తుంది..
ఒకసారి అలాంటి పాత్రల్లో నటించాక ఏ నటుడైనా సినీప్రియుల్లో రియల్‌ హీరోగా మారిపోక తప్పదు.. అందుకే ప్రతి నటుడూ తన సినీ కెరీర్‌లో ఒక్క స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలోనైనా నటించాలని కోరుకుంటాడు.

ఇప్పుడు తెరపైకి 'సైరా నరసింహారెడ్డి'గా అడుగు పెట్టబోతున్న చిరంజీవిని ఇలాంటి కలే 12 ఏళ్ల పాటు కుదురుగా ఉండనివ్వలేదు. కానీ, ఎట్టకేలకు ఆ కల ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. కానీ, ఆయన కన్నా ముందుగానే తెలుగు తెరపై స్వాతంత్య్ర సమరయోధులుగా సందడి చేసి మెప్పించిన అగ్ర తారలు కొందరు ఉన్నారు. వీరిలో సూపర్‌స్టార్‌ కృష్ణను తెలుగు తెరపై సమరయోధుల కథలకు ఊపిరిలూదిన హీరోగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన 'అల్లూరి సీతారామరాజు' చిత్ర విజయమిచ్చిన స్ఫూర్తితో తర్వాతి తరంలో వచ్చిన ప్రతి అగ్ర హీరో ఆ బాటలో నడిచి తమ కలను నిజం చేసుకుని మంచి విజయాలనూ ఖాతాలో వేసుకున్నారు. కొందరు నిజమైన సమరయోధుల జీవిత కథల్లో నటించి మెప్పిస్తే.. మరికొందరు కల్పిత గాథలతో కనిపించి బ్రిటీష్‌ వారిపై అలుపెరుగని పోరు చేసి ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలించారు. ఇలా తెలుగు తెరపై ఇప్పటి వరకు వచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల జీవితగాథలను పరిశీలిస్తే.. ముందుగా అందరికీ గుర్తొచ్చేది మన్యం వీరుడు అల్లూరి విజయగాథే.

అల్లూరి సీతారామరాజుతో ఆరంభం

స్వాతంత్రోద్యమ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలనగానే తెలుగులో తొలుత అందరి మదిలో మెదిలే చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. ఇప్పుడీ బాటలో వస్తోన్న విప్లవ వీరుల చిత్రాలన్నింటికీ ఈ అల్లూరే స్ఫూర్తి. స్వతంత్రం కోసం బ్రిటీష్‌ పాలకుల్ని ఎదిరించి ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాధారంగా సూపర్‌స్టార్‌ కృష్ణ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించి.. తానే నటించారు. కృష్ణ చేసిన ఈ సాహసం అప్పట్లో ఓ సంచలనం. అప్పట్లో ఈ కథ ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్‌ బాబు వంటి వారి వద్దకు వెళ్లినా ఈ తరహా కథలు ఎవరు చూస్తారనే ఉద్దేశంతో ఇందులో నటించేందుకు ముందుకు రాలేదు. కానీ, కృష్ణ మాత్రం సాహసించి అపురూప దృశ్యకావ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన 100వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో 19 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. తెలుగులో వచ్చిన తొలి కలర్‌ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. తెల్లవాడి తుపాకీ గుండెలపై ఉన్నా స్వాతంత్య్ర నినాదమే శ్వాసగా చివరి రక్తపు బొట్టు వరకు బ్రిటీష్‌ వారితో పోరాడి కోట్లాది మందిలో పోరాట స్ఫూర్తిని రగిలించాడు మన్యం వీరుడు అల్లూరి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తెల్లవారిని హడలెత్తించిన భారతీయుడు

బ్రిటీష్‌ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన తర్వాతి తరం హీరోల్లో కమల్‌హాసన్‌ పేరు చెప్పుకోవాలి. కమల్‌ కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కించిన 'భారతీయుడు'తో ఈ అద్భుత దృశ్యం తెరపై ఆవిష్కృతం అయింది. వాస్తవానికి ఈ సినిమా ఆద్యంతం ఇదే బ్యాక్‌డ్రాప్‌లో నడవదు. కేవలం సేనాపతి ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో మాత్రమే ఈ తెల్లవారిపై పోరు కనిపిస్తుంది. ఈ పోరాటాన్నే ఆయుధంగా చేసుకుని ఆ తర్వాత అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు సేనాపతి. ఇలా ఓ అద్భుతమైన సమరయోధుడిగా కమల్‌ ఒదిగిపోయిన విధానానికి, ఆ పాత్రలో ఆయన పండించిన హీరోయిజానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అప్పట్లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది.

బోస్​గా మారి ముచ్చటతీర్చుకున్న వెంకీ

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కథ స్ఫూర్తితో వెంకటేష్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన చిత్రం 'సుభాష్‌ చంద్రబోస్‌'. ఈ చిత్ర నేపథ్యమూ బ్రిటీష్‌ వారిపై పోరాటం నేపథ్యంలోనే సాగుతుంది. అయితే ఇది నిజ జీవిత గాథ కానప్పటికీ.. ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ ఉద్యమ స్ఫూర్తితో తెరకెక్కించడం విశేషం. ఇందులో వెంకీ రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో తెల్లవారిపై అలుపెరుగని పోరు చేసి వీరమరణం పొందిన యోధుడు చంద్రబోస్‌గా కనిపించగా.. మరో పాత్రలో నేటి తరానికి ప్రతినిధిగా కనిపించి అలరిస్తాడు.

'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బాలయ్య

తెలుగు తెరపై సందడి చేసిన సమరవీరుల కథలకు కాస్త భిన్నమైంది బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'. కానీ, అంతర్లీనంగా మాత్రం స్వతంత్ర కాంక్షే దర్శనమిస్తుంది. వివిధ రాజ్యాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావాలని తల్లి చెప్పిన మాటకు కట్టుబడి దేశం కోసం యుద్ధాలు చేసిన ఓ వీరుడి కథే 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఇందులో శాతకర్ణిగా బాలకృష్ణ శత్రువులపై కత్తిదూస్తూ తన పోరాటాలతో తెరపై ఓ అద్భుతమైన హీరోయిజాన్ని చూపించాడు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.

'రాజన్న'గా నాగ్

ఓవైపు తెల్లవారిపై పోరు.. మరోవైపు నిజాం నవాబుకు వ్యతిరేకంగా కర్కశ రజాకార్లపై పోరాటం. ఈ రెండు నేపథ్యాలతో అల్లుకున్న దేశభక్తి చిత్రమే ‘రాజన్న’. టైటిల్‌ పాత్రను నాగార్జున పోషించాడు. దేశవ్యాప్తంగా బ్రిటీష్‌ వారి అరాచక పాలన ముగిసినా ఆ స్వాతంత్య్రపు సువాసనలు అందుకోలేని నిజాం రాజ్యంలో అటు రజాకార్లపై వారికి అండగా నిలుస్తోన్న తెల్లదొరలపై అలుపెరగని పోరాటం చేసి వీర మరణం పొందుతాడు రాజన్న. ఈ పాత్రలో నాగార్జున ఒదిగిపోయిన విధానం.. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ సినిమాను తెరకెక్కించిన తీరు, మల్లమ్మ పాత్ర.. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి.

అనుష్క 'రుద్రమదేవి'గా మారిన వేళ

స్వాతంత్య్ర పోరాటం అనగానే ఉయ్యాలవాడ, అల్లూరి, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి పోరాట వీరులే కాదు.. రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి అపర కాళికలూ గుర్తొస్తారు. వీరిలో రుద్రమదేవి జీవితాధారంగా దర్శకుడు గుణశేఖర్‌ అనుష్కతో చేసిన సాహసమే ‘రుద్రమదేవి’. ఈ చిత్రమూ ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలించింది. ఇందులో రుద్రమదేవి పాత్రతో కదన రంగంలో శత్రువుల గుండెల్లో అనుష్క కత్తులు దూసిన తీరు.. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ కనబర్చిన నటన.. తెరపై అద్భుత విజయాన్ని అందించాయి. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తొలిసారి ఓ వీరనారి పోరాటాన్ని తెరపై దర్శించుకునే వీలు దక్కింది.

సై.. సై.. సైరా

దేశంలో సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే తెల్లవారిపై పోరుకు సై అన్న తొలి స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన పోరాట స్ఫూర్తితోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేలాదిమంది విప్లవ వీరులు పుట్టుకొచ్చారు. కానీ, ఈ తొలి స్వాతంత్య్ర సమరయోధుడి కథ చరిత్ర పుటల్లో ఎప్పుడో మసకబారిపోయింది. అయితే ఇప్పుడీ యోధుడి పోరాట గాథను 'సైరా' రూపంలో యావత్‌ భారతావనికి కానుకగా అందించబోతున్నాడు మెగాస్టార్​ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా.. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించగా.. మెగాపవర్​ స్టార్​ రామ్‌చరణ్‌ నిర్మించాడు.

అల్లూరి+కొమురం భీం= ఆర్​ఆర్ఆర్

ఇప్పటి వరకు వెండితెరపై ఒక స్వాతంత్య్ర యోధుడి కథనే వీక్షించిన ప్రేక్షకులకు.. ఒకేసారి అటు మన్యం వీరుడు అల్లూరి కథను, ఇటు గిరిజన వీరుడు కొమురం భీం జీవిత గాథను చూపించబోతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి రాబోతున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రంతో ప్రేక్షకులకు ఈ సాహసాన్ని రుచి చూపించబోతున్నాడు. ఇప్పుడీ సినిమా కోసమే ఆదివాసీల పోరాట వీరుడు కొమురం భీం పాత్రలోకి ఎన్టీఆర్‌ పరకాయ ప్రవేశం చేయబోతుండగా.. మన్యం వీరుడు అల్లూరి పాత్రలో ఒదిగిపోయేందుకు రామ్‌చరణ్‌ సిద్ధమయ్యాడు. మరి వీళ్లిద్దరూ కలిసి స్వాతంత్య్ర పోరాటంలో ఎలా పోరు సలిపారో చూడాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో అంచనాలు ఏర్పాడ్డాయి.

tollywood
ఆర్​ఆర్ఆర్

ఇవీ చూడండి.. సుశాంత్​ 'అన్నయ్య' కాదట... మరి నవదీప్​ సంగతి?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Boston, Massachusetts, USA. 30th September 2019.
1. 00:00 SOUNDBITE (English) Kemba Walker, Boston Celtics Guard:
(On what he brings to the Celtics)
"You know just some some veteran leadership. Some enthusiasm. Some positive energy and that's what I'm here for and I'm just kind of here to be myself. (You) know I think I'm pretty easy to get along with so I think I know that transition and no guys just being able to like me and stuff like that would make the transition easier. So yeah I'm looking forward to being a part of this this organization and giving it 100 percent on each and every possession and play like I can."
2.00:35 SOUNDBITE (English) Kemba Walker, Boston Celtics Guard:
(How is it playing for first new team in professional career)
"Just different you know. This is my ninth media day and I know my first one with a new organization, s yeah it's just it's just different. You know I just feel like the new kid in school like when you first go to a new city or something  like that but it's cool. You know I'm looking forward to adjusting. I'm looking forward to you know getting to know everyone. So yeah I'm I'm excited I think it's a lot of emotions just all in one."
3. 01:08 SOUNDBITE (English) Gordon Hayward, Boston Celtics Forward:
(What does Kemba Walker bring to Celtics)
"Yeah he's definitely a game-changer and I think the pace that he plays that changes game. Certainly one of the quickest guys in the league with the ball in his hands and he seems to be able to find the seam in any defense and so. . . not only for himself making plays for himself once he gets in there but also making plays for our team and you know it's definitely something that I'm looking forward to and I think he's a he's a great guy too so he'll help us kind of with the leadership to."
4. 01:47 SOUNDBITE (English) Brad Stevens, Boston Celtics Head Coach:
(On new team chemistry)
"Yeah I mean I think all that you know I've always thought and believed about the game has just been reinforced and we're looking forward to getting to work. Every team is its own entity so every team has different needs. I've said last week this team will have to play a little bit differently on both sides of the ball than we have not, not enormously differently but we'll have to do little things here and there and then you know our focus over the next couple of weeks is just getting ready to play with the right effort togetherness and that's it. You know I think that at the end of the day that will give us a chance to be the best version of ourselves and obviously at the end of the season that's what you want to be able to point to. I like this team I like their work ethic. They've done a great job of earning the right to practice well to start a season well. But there's a lot of things ahead and we're looking forward to getting started."
SOURCE: ESPN
DURATION: 02:49
STORYLINE:
The Boston Celtics hosted their media day on Monday (30 September).
Last spring Boston lost in the Eastern Conference semi-finals, falling in five games to the Milwaukee Bucks.
The Celtics, who went 49-33 in the 2018-19 regular season, begin their '19-20 campaign in Philadelphia on 23 October against the 76ers.
Last Updated : Oct 2, 2019, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.