ETV Bharat / sitara

టాలీవుడ్​లో 'హిట్​' కొట్టారు.. మరి బాలీవుడ్​లో? - ashok director durgamati

పలువురు తెలుగు దర్శకులు.. బాలీవుడ్​లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారిలో యువ డైరెక్టర్లతో పాటు సీనియర్లూ ఉన్నారు. ఇంతకీ వాళ్లు ఏ సినిమాలు చేస్తున్నారు. అందులో ఎవరు నటిస్తున్నారు? వంటి అంశాల సమాహారమే ఈ కథనం.

tollywood directors who enter into bollywood
టాలీవుడ్​లో 'హిట్​' కొట్టారు.. మరి బాలీవుడ్​లో?
author img

By

Published : Dec 18, 2020, 9:46 AM IST

Updated : Dec 18, 2020, 10:12 AM IST

తెలుగులో సినిమా తీశారు. హిట్​ కొట్టారు. వావ్ అనిపించారు. కానీ అంతటితో ఊరుకోలేదు. వాళ్ల చూపు బాలీవుడ్​పై పడింది. అక్కడా తమ ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యారు. షూటింగ్​లతో కొందరు బిజీగా ఉండగా, మరికొందరు ఇప్పటికే హిట్​లు కొట్టి శెభాష్ అనిపించుకున్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు? ఏయే ప్రాజెక్టులు చేస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.

'కబీర్​ సింగ్​'తో సందీప్​

విజయ్ దేవరకొండ 'అర్జున్​ రెడ్డి'.. టాలీవుడ్​లో​ సెన్సేషన్​ సృష్టించింది. అదే సినిమాను హిందీలో షాహిద్​ కపూర్​తో 'కబీర్ సింగ్'గా తీశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను అలరించడం సహా బాక్సాఫీసు దగ్గర దుమ్ములేపింది. దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో సందీప్​.. టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ ఫేమస్ అయిపోయారు.

'దుర్గామతి'తో అశోక్

కథానాయిక ప్రాధాన్య కథతో రూపొందిన చిత్రం 'భాగమతి'. స్వీటీ అనుష్క శెట్టి టైటిల్​ రోల్​లో అదరగొట్టింది. జి.అశోక్ దర్శకుడిగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాను 'దుర్గామతి' పేరుతో బాలీవుడ్​లో రీమేక్ చేసి, ఇటీవల ఓటీటీలో విడుదల కూడా చేశారు. భూమి పెడ్నేకర్, అనుష్క చేసిన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాకు వీక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ అశోక్ దర్శకత్వ ప్రతిభ బాలీవుడ్​లోనూ మెరిసింది.

ashok director
దర్శకుడు అశోక్

'జెర్సీ'తో గౌతమ్

క్రికెట్​ కథలతో టాలీవుడ్​లో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్​ అంటే 'జెర్సీ' అనే చెప్పాలి. నేచురల్ స్టార్ నాని, తన అద్భుత నటనతో కంటతడి పెట్టించారు. అనిరుధ్, తన సంగీతంతో ప్రతి సీన్​లోనూ లీనమయ్యేలా చేశారు. గౌతమ్ తిన్ననూరికి దర్శకుడిగా ఇది రెండో సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీసి అందరి చేత శెభాష్ అనిపించుకున్నారు. బాలీవుడ్​లో ఈ సినిమాను షాహిద్ కపూర్​ హీరోగా తీస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల కానుంది. మరి అక్కడ గౌతమ్​ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో?

goutham tinnanuri
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

'హిట్​'తో శైలేష్

ఈ ఏడాది మార్చిలో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ 'హిట్'. విశ్వక్​సేన్ హీరోగా చేయగా, శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయమయ్యారు. దీనికి వచ్చిన ఆదరణ చూసి, బాలీవుడ్​లోనూ తీసేందుకు నిర్మాతలు దిల్​రాజు, అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. రాజ్​కుమార్ రావ్​తో హిందీలో ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా, వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది. మరి శైలేష్​ అక్కడ కూడా 'హిట్​' కొడతారో లేదో చూడాలి.

hit movie remake
దిల్​రాజు-శైలేష్ కొలను-రాజ్​కుమార్ రావ్

'ఛత్రపతి' రీమేక్​తో వినాయక్

ఎన్నో హిట్​ సినిమాలతో టాలీవుడ్​లో స్టార్ డైరెక్టర్​గా గుర్తింపు తెచ్చుకున్నారు వీవీ వినాయక్. కానీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చాన్నాళ్లకు బాలీవుడ్​ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం 'ఛత్రపతి' రీమేక్​ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదే సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్.. హీరోగా బాలీవుడ్​కు పరిచయమవుతున్నారు. మరి వీరి ద్వయం హిందీ ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

chatrapathi remake team
ఛత్రపతి రీమేక్​ చిత్రబృందం

Last Updated : Dec 18, 2020, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.