ETV Bharat / sitara

'జనం పడుతున్న కష్టాల ముందు సినిమా చిన్న సమస్య'

దర్శకుడు కొరటాల శివ సామాజిక అంశాలతో పాటు ప్రకృతి ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేసేలా కథలను రాసుకుంటారు. కరోనా వల్ల ప్రపంచమంతా స్తంభించిపోయే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని.. దీనితో జీవరాశి అంతం కాదని శివ తాజాగా వెల్లడించారు. ప్రకృతికి వ్యతిరేకంగా జీవనం సాగించటం సహా.. ఆహారపు అలవాట్లను మార్చుకోవటమే ఇలాంటి విపరీతాలకు కారణమని తెలిపారు.

Tollywood Director Koratala Siva Special Interview
'ప్రపంచమంతా ఇలా ఆగిపోయే రోజు వస్తుందనుకోలేదు'
author img

By

Published : Apr 17, 2020, 10:22 AM IST

తర తమ భేదం లేకుండా.. ప్రేమని పంచుకుంటున్నాం.. సమాజానికి తిరిగి ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నాం.. ప్రకృతి గురించి మాట్లాడుకుంటున్నాం.. మన బాధ్యతల్ని గుర్తు చేసుకుంటున్నాం. కరోనా తెచ్చిన కష్ట కాలంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ తన సినిమాల్లో స్పృశించారు అగ్ర దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కొరటాల శివతో ప్రత్యేకంగా ముఖాముఖి.

కొత్త కథలపై దృష్టిపెట్టా. ఇకపైన ఎక్కువ కాలం నిరీక్షించను. నాక్కూడా వయసైపోతోంది కదా. ఎక్కువ సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. మహేశ్​తో హ్యాట్రిక్‌ సినిమా కచ్చితంగా ఉంటుంది. మూడో సినిమా అంటే.. ఈసారి ఎంత పెద్ద కథ రాయాలనే ఒక ఆలోచన ఉంటుంది కదా! అందరి అంచనాలకి తగ్గట్టుగానే ఆ సినిమా ఉంటుంది.

Tollywood Director Koratala Siva Special Interview
కొరటాల శివ

లాక్‌డౌన్‌ తర్వాత జీవితం ఎలా ఉంది?

పని మనుషులకి రెండు నెలల జీతాలు ఇచ్చేసి పంపించేశాం. ఇంట్లో పనులన్నీ పంచుకుని చేసుకుంటున్నాం. పుస్తకాలు చదవడం, మిస్‌ అయిన సినిమాల్ని చూడడం, రాసుకోవడం, సాయంత్రం అపార్ట్‌మెంట్‌ కిందకెళ్లి వాకింగ్‌ చేసుకోవడం. ఇదొక రకమైన జీవితం. కొన్ని రోజులపాటు మన గురించి మనం ఆలోచించుకునే సమయం వచ్చింది. ఇదివరకటిలాగా ఇప్పుడు రేసులు లేవు, పరుగెత్తడాలు లేవు.

ఎప్పుడైనా... ఎందుకోసం ఈ పరుగులు అన్న ఆలోచనలు వచ్చేవా?

మనందరం కూడా ఒక రేసులోకి వెళ్లిపోయాం. పోటీ వాతావరణం అలాంటిది. సమాజంతో పాటే పరిగెత్తడం అలవాటు చేసుకున్నాం. ఈ పోటీతత్వం తగ్గాలి, మరో రకమైన జీవన విధానం అలవాటు కావాలంటే మళ్లీ ఎలిమెంట్రీ స్కూల్‌ నుంచి మొదలుపెట్టాల్సిందే.

ప్రపంచమంతా ఇలా ఆగిపోయే రోజు వస్తుందని ఎప్పుడైనా ఊహించారా?

ఇది ఊహించనిదేమీ కాదండీ. మనం ఇలాగే ఉంటే, ప్రకృతి ఏదో ఒకటి చేస్తుందని మాట్లాడుకున్నవాళ్లమే. విపరీతానికి వెళితే వినాశనమే అనేది మనందరికీ తెలుసు. కరోనా అనేది ఒక వింతగా, ఎవ్వరూ ఊహించని రీతిలో వచ్చింది. ప్రకృతి అంటే ఒక భయం ఉండాలనేది మనందరికీ తెలిసిందే. మనం రేసులో పడిపోవడం వల్ల దాని ప్రభావం తెలియలేదు.

ఈ విపత్తు నుంచి మనం ఏం నేర్చుకోవాలి?

మొదట ప్రభుత్వాలు, నిపుణులు చెబుతున్నది విని, ఆచరిద్దాం. కరోనాతో ప్రపంచమేమీ అంతం కాదు. కానీ మనం గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. ఇకపై రోజుకు 30 సార్లు చేతులు మాత్రమే శుభ్రం చేసుకుంటామనేది వేలం వెర్రి. జీవన శైలిలోనే మార్పు రావాలి. ఒక్కొక్క దేశానికి ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కానీ మనం విదేశీ ఆహారం అంటూ ప్రకృతికి విరుద్ధంగా తినడం అలవాటు చేసుకున్నాం. స్వచ్ఛభారత్‌ అని కేంద్రం చెప్పింది. కానీ ప్లాస్టిక్‌ బాటిల్‌ని రోడ్డుపై విసిరేసి వెళ్లి పోతున్నాం. గొప్ప సంస్కృతి ఉన్న నేల మనది. ఇక నుంచైనా మనం మనలా ఉందాం. ప్రభుత్వం కఠిన నియమాలు తీసుకురావాలి. ఒక్కో నేలకి ఒక న్యాయం ఉన్నట్టుగా... ఈ నేలకీ ఒక న్యాయం ఉంది. దాన్ని అందరూ పాటించాలి. మనలో మార్పు వస్తుందని గట్టిగా నమ్ముతున్నా.

మీరు చేసిన సినిమాల లక్ష్యం.. ఇలాంటి మార్పే కదా?

మనం రోజూ చూస్తున్న, మాట్లాడుకుంటున్న విషయాలపైనే సినిమాలు చేశా. మన చుట్టూ జరిగే బోలెడు సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతుంటాం. కరోనా తర్వాత ఆ నేపథ్యంలో కొన్ని ఆలోచనలొచ్చాయి.

'ఆచార్య'లో రామ్‌చరణ్‌ ఉండాలని ముందే అనుకున్నారా? ఆయనకి బదులుగా మహేశ్​ నటిస్తున్నారట కదా, నిజమేనా?

కథలో ఒక బాధ్యతాయుతమైన పాత్ర ఉంది. రామ్‌చరణ్‌ చేస్తే బాగుంటుందనుకున్నా. చిరంజీవి సర్‌కి చెప్పగానే బాగుంటుందన్నారు. రామ్‌చరణ్‌.. పాత్ర గురించి విని పచ్చజెండా ఊపారు. ఆయన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తున్నారు కాబట్టి దాన్నిబట్టి ప్లాన్‌ చేసుకుందామనుకున్నా. కానీ ఆ సినిమా వాయిదా పడింది. ఈలోగా మా 'ఆచార్య' విడుదల కూడా వచ్చే ఏడాదనే ప్రచారం మొదలైంది. దాంతో లోపల చిన్న టెన్షన్‌ మొదలైంది. ఈ హడావుడి మధ్యలోనే అనుకోకుండా మహేశ్​బాబుతో మాట్లాడా. మాటల మధ్యలో 'సినిమా విడుదల ఎప్పుడు?' అని అడిగారు. అదే స్పష్టత రావడం లేదండీ అన్నా. నా ఒత్తిడిని గమనించి 'మరీ టెన్షన్‌ పరిస్థితి అనుకుంటే నేనున్నా' అన్నారాయన. ఆ మాట విని షాకయ్యా. మహేశ్​ లాంటి హీరో ఆ మాట అన్నాక ఎంత ధైర్యం వస్తుంది! ఆ ఆనందంలో ఇదే విషయాన్ని కొందరితో పంచుకున్నా. అది రకరకాలుగా ప్రచారమైంది. ఆయన గొప్ప మనసుతో, పాత్ర ఏంటో తెలియకుండా సరదాగా, నేనున్నా అని చెప్పారు. మహేశ్​తో... నాకున్న ఒక అందమైన ఎపిసోడ్‌ అది.

'ఆచార్య'లోనూ మీ శైలిలో సామాజికాంశాల్ని స్పృశించబోతున్నారా?

నా స్టైల్‌ తప్పకుండా ఉంటుంది. చిరంజీవి సర్‌ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దృష్టిలో పెట్టుకుని, వాటికి నా శైలి అంశాల్ని జోడిస్తూ ఈ సినిమా చేస్తున్నా. ప్రేక్షకుడికి గొప్ప అనుభవాన్నయితే ఇస్తామనే నమ్మకం నాకుంది. చిరంజీవి గారి కోసం శక్తిమంతమైన పాత్రని డిజైన్‌ చేశా.

'ఆచార్య' ఆలస్యం కావడం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?

చిరంజీవి.. 'సైరా'లో నటిస్తున్నప్పుడే 'ఆచార్య' ఖాయమైంది. 'సైరా' వల్ల మా సినిమా ఆలస్యంగా పట్టాలెక్కింది. ఈమధ్యే చిత్రీకరణని మొదలుపెట్టినా అప్పుడే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసేశాం. ఇంతలోనే కరోనా ప్రభావం మొదలైంది. జనం పడుతున్న కష్టాల ముందు మా సినిమా చాలా చిన్న సమస్య.

మరిప్పుడు ఆ పాత్రని చరణే చేయబోతున్నారా?

కరోనా తర్వాత ఏ సినిమా ఏమిటనేది ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడే సమయమే కాదు. ఆయన సినిమాలు, ఆయన ప్రాధాన్యాలు ఆయనకున్నా ఎవ్వరూ ఊహించని రీతిలో నేనున్నాని మహేశ్​ అన్నారంటే ఆయనకి ఎంత పెద్ద మనసుండాలి? ఈ వేదిక నుంచి ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా.

ఇదీ చూడండి.. నటనలో సావిత్రిని మరిపించి.. దివికెగిసిన సౌందర్య తార

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.