ETV Bharat / sitara

'ఈటీవీ' సిల్వర్​ జూబ్లీ: టాలీవుడ్​ ప్రముఖుల శుభాకాంక్షలు

దక్షిణాన తొలి శాటిలైట్​ ఛానల్​ ఈటీవీ ప్రారంభమయ్యి నేటితో పాతికేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి పలువురు టాలీవుడ్​ ప్రముఖలు శుభాకాంక్షలు తెలిపారు.

tollywood celebreties about etv silver jublee celebrations
'ఈటీవీ' సిల్వర్​ జూబ్లీ: టాలీవుడ్​ ప్రముఖుల శుభాకాంక్షలు
author img

By

Published : Aug 27, 2020, 7:16 AM IST

ఈటీవీ అంటే తెలుగు జీవితాల్లో ఒక భాగం. తరాలు మారుతున్నా సరే... ప్రేక్షకుల హృదయాల్లో ఆ స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. నిత్యనూతనంగా అందరి మనసుల్నీ దోచేస్తోంది. స్వచ్ఛమైన వినోదాన్ని ఆస్వాదించాలన్నా... హాయిగొలిపే సంగీతం వినాలన్నా... ప్రామాణికతతో కూడిన సమాచారం తెలుసుకోవాలన్నా గుర్తుకొచ్చేది ఈటీవీనే. అప్రయత్నంగా చేయి ఈటీవీ మీట వైపు వెళుతుంది. పాతికేళ్లుగా ఈటీవీ మనందరి టీవీగా కొనసాగుతూ అలరిస్తోంది. ఈటీవీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మన సినీ ప్రముఖులు తమ అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించారు....

tollywood celebreties about etv silver jublee celebrations
చిరంజీవి

"టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, టీవీని 24గంటలు వీక్షించేలా చేసిన ఘనత మన దేశంలో ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు గారికే దక్కుతుంది. ఆయన నాలాంటి వారికి గురుసమానులు, పితృ సమానులు. 25 సంవత్సరాల పాటు ఈటీవీ అప్రతిహతంగా సాగిపోవడానికి ఆయన కృషి, అకుంఠిత దీక్ష కారణం. ఆయన తెలుగు చరిత్ర ఉన్నంతవరకూ గుర్తుండిపోయే గొప్ప లక్ష్య సాధకులు. ఈటీవీ మొదటి వార్షికోత్సవానికి, రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పుడూ విశిష్ట అతిథిగా హాజరయ్యా. ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు సిల్వర్‌ జూబ్లీ వేడుకలోనూ పాలుపంచుకోవటం, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవటం ఎనలేని గౌరవంగా భావిస్తున్నా."

- చిరంజీవి, కథానాయకుడు

వెంకటేష్​

"25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి నా అభినందనలు. ఎన్నో కార్యక్రమాలతో మమ్మల్ని అలరిస్తున్నారు. ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా."

- వెంకటేష్​​, కథానాయకుడు

మహేశ్​ బాబు

"25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ప్రత్యేక శుభాకాంక్షలు. ఈటీవీ రెండున్నర దశాబ్దాల పాటు అంచెలంచెలుగా ఎదగడాన్ని చూస్తే సంతోషంగా ఉంది. రామోజీరావు, ఈటీవీ బృందానికి నా అభినందనలు."

- మహేశ్‌బాబు, కథానాయకుడు

నాగార్జున

"1995 నుంచి 2020. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఈటీవీ. ఈటీవీ అంటే ఒక సంచలనం. 1995-96 మధ్య కాలంలో ఫలానా సమయానికి ఫలానా కార్యక్రమం వస్తుందని తెలుసుకుని ఈటీవీ పెట్టుకుని టీవీ ముందు కూర్చునేవాణ్ని. నాకు బాగా నచ్చిన కార్యక్రమం...పాడుతా తీయగా. సినిమాలోని పాటలు చూసినప్పుడు ఆ పాటలు మళ్లీ చూడాలనిపిస్తోంది. చూసే అవకాశం ఉండదు. ఈటీవీలో ఆ పాటలు చూడటం నాకు బాగా గుర్తు. స్నేహితులతో కూడా మాట్లాడుకునేవాళ్లం. అలాగే ఈటీవీ న్యూస్‌... నాటి నుంచి నేటి వరకు ఈటీవీ న్యూస్‌ అంటే అదో స్టాంప్‌. నిజమైన, ప్రామాణికమైన సమాచారానికి ఈటీవీ ఒక స్టాంప్‌. ఇప్పుడు కూడా అంతే."

- నాగార్జున, కథానాయకుడు

పవన్‌కల్యాణ్‌

"క్షిణాదిన తొలి శాటిలైట్‌ ఛానల్‌ ఈటీవీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నా శుభాభినందనలు. నంది అవార్డులతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను ఈటీవీ అందుకుంది. గోల్డెన్‌జూబ్లీతో పాటు మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ఈటీవీ సిబ్బందికి నా ప్రత్యేక శుభాభినందనలు".

- పవన్‌కల్యాణ్‌, కథానాయకుడు

కే రాఘవేంద్రరావు

"న్నదాతలకు, మహిళలకు, తెలుగు భాష అభివృద్ధికి, వంటలకు, సంగీత ప్రియులకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేసి... ఈటీవీ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 20ఏళ్ల క్రితం నా మొదటి సీరియల్‌ శాంతినివాసంతో ఈటీవీతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు మా ద్వారా ఈటీవీ చేయించినందుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లోనూ మన ప్రయాణం ఇలాగే సాగాలని కోరుకుంటున్నా".

- కె.రాఘవేంద్రరావు, దర్శకుడు

దేవీశ్రీప్రసాద్​

"నాకు ఈటీవీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా సినీ ప్రయాణంలో మ్యూజికల్‌గా పెద్ద విజయం 'ఆనందం'. అది ఈటీవీకి సంబంధించింది కావటం చాలా సంతోషం. సంగీత కార్యక్రమాలకు ఈటీవీ ప్రాధాన్యం ఇవ్వడం నచ్చింది. పాడుతాతీయగా, స్వరాభిషేకం కార్యక్రమాలు చాలా మంది గాయకుల్ని వెలుగులోకి తీసుకొచ్చాయి".

- దేవిశ్రీప్రసాద్‌, సంగీత దర్శకుడు

రాజమౌళి

"టీవీతో నాకు అవినాభావ సంబంధం ఉంది. శాంతి నివాసం ధారావాహిక ద్వారా దర్శకుడిగా నా పేరు తొలిసారి ఈటీవీలోనే చూసుకున్నా. ఈటీవీలో నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తారు. ఓ వార్త నిజమో కాదో తెలియాలంటే ఈటీవీనే చూస్తారు. ఆ నమ్మకాన్ని ఏర్పరుచుకున్న ఈటీవీ నెట్‌వర్క్‌కు 25 ఏళ్లు పూర్తయింది. ఇలానే ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా".

- ఎస్‌.ఎస్‌.రాజమౌళి, దర్శకుడు

అలీ

"25 వసంతాలు పూర్తి చేసుకున్న మనందరి ఛానెల్‌ ఈటీవీ. ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉంది. ఈ ఛానెల్‌ ద్వారా కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. జబర్దస్త్‌, వావ్‌, అలీతో సరదగా లాంటి ఎన్నో కార్యక్రమాలతో సాంకేతిక నిపుణులు, కళాకారులు దర్శకులు ఇలా ఎంతోమందిని ఆదరించి, ఆశీర్వదించింది".

- అలీ, నటుడు

సుహాసిని

" రోజుతో మీ టీవీ, మన టీవీ, ఈటీవీకి 25 సంవత్సరాలు. సిల్వర్‌ జూబ్లీ... ఇంత సంతోషకరమైన క్షణాల్ని మనందరం పండగలా జరుపుకోవాల్సిందే".

- సుహాసిని, నటి

రాజేంద్రప్రసాద్​

"టీవీకి సిల్వర్‌ జూబ్లీ శుభాకాంక్షలు. ఉదయాన్నే భక్తి కార్యక్రమాలు, సాయంత్రం ఆటపాటలతో అలరిస్తుంది. సాయంత్రం సీరియల్స్‌తో ప్రేక్షకులకు ఈటీవీ చేరువైంది. ఈటీవీ వార్తల్లో ఎంతో నిబద్ధత ఉంటుంది. అందుకే మనమందరం ఈటీవీ నాటీవీ అన్నాం. ఈటీవీ మన జీవితాలకు అనుసంధానమైంది".

- రాజేంద్రప్రసాద్‌, నటుడు

ఎమ్​ఎమ్​ కీరవాణి

"తెలుగు ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకున్న ఈటీవీకి 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. 1995లో నాకు బాపినీడు గారు ఫోన్‌ చేసి ‘ఈటీవీ మెుదలుపెడుతున్నాం. స్వాగత గీతం చేసి పెట్టాలన్నారు. ఆ పాట బాలు గారితో పాడించి వారికి పంపించాను. అది జరిగి అప్పుడే 25 ఏళ్లైంది. ఈటీవీని మనసారా అభినందిస్తూ...ఇంకా ఎన్నో సంవత్సరాలు సమాజానికి ఎంతో సేవ చేయాలి".

- ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, సంగీత దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.