ETV Bharat / sitara

సమయం ఆసన్నమైంది మిత్రమా.. పెళ్లి రైలు ఎక్కేద్దాం! - టాలీవుడ్​ హీరోల పెళ్లిల కథలు

తమ అభిమాన హీరో పెళ్లంటే ఫ్యాన్స్​కు పండగే. ఇటీవలే మన మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్స్​ నితిన్​, రానా, నిఖిల్​ తమ వివాహాల కబుర్లు చెప్పేశారు. అందుకు తగిన ఏర్పాట్లలోనూ బిజీగా ఉన్నారు. కానీ ప్రభాస్​తో సహా మరికొంత మంది యువ హీరోలు మాత్రం తమ పెళ్లిపై నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​లో ఏఏ హీరోలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ? ఎవరెవరు ఇంకా బ్యాచిలర్​ లైఫ్​ను గడుపుతున్నారో తెలుసుకుందాం.

bachelor life
బ్యాచిలర్​ లైఫ్​
author img

By

Published : Jun 6, 2020, 12:07 PM IST

టాలీవుడ్‌లో బ్రహ్మచారుల‌ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మన హీరోలు బ్యాచ్​లర్ లైఫ్​కు బైబై చెబుతూ.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే నితిన్‌ పెళ్లి కబురు అభిమానుల చెవిన వేయగా.. ఇటీవలే నిఖిల్‌ కూడా వివాహం చేసుకున్నారు. రానా తన ప్రియురాలు మిహీకా బజాజ్‌‌ ఫొటో పంచుకుంటూ అందరికీ షాక్‌ ఇచ్చారు. భళ్లాలదేవుడి వివాహం అనగానే.. అందరి చూపు ప్రభాస్‌పై పడింది. రకరకాల మీమ్స్‌తో కొన్ని రోజులపాటు నెట్టింట్లో ప్రభాస్‌ పెళ్లిపై సరదా చర్చలు నడిచాయి. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మరికొందరు హీరోల పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది.

meme
మీమ్​

యువ కథానాయకుడు నిఖిల్‌ కొన్ని రోజుల క్రితమే ఓ ఇంటివాడయ్యారు. అతడు వైద్యురాలు పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు.. పెద్దల సమ్మతితో ఒక్కటయ్యారు. ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మే 14న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో వీరి పెళ్లి జరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా పరిమిత సంఖ్యలో హాజరైన ఇరు పక్షాల కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించారు.

nikhil marriage
నిఖిల్​ పెళ్లి

యువ హీరో నితిన్‌ కూడా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే తన ప్రేయసి షాలినితో నితిన్‌ నిశ్చితార్థం జరిగింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఆయన సన్నాహాలు చేశారు. అయితే కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 16న జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేసినట్లు నితిన్‌ ప్రకటించారు. ఇది సరైన సమయం కాదని అన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత నితిన్‌, షాలినిల వివాహం జరగనుంది.

nithin
నితిన్​

కథానాయకుడు రానా పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు మే 12న ఆయన తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను అందరికీ పరిచయం చేశారు. తన ప్రేమ ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. వీరి పెళ్లి వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇటీవల రోకా ఫంక్షన్‌ జరిగింది. డిసెంబరు లోపు తన కుమారుడి వివాహం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సురేశ్‌బాబు చెప్పారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లో వీరి వివాహ తంతు జరగనున్నట్లు సమాచారం.

rana
రానా

ఇప్పుడు టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు ప్రభాస్‌. ఆయన శుభవార్త ఎప్పుడు చెబుతారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. డార్లింగ్‌ పెళ్లిపై కృష్ణంరాజు, ఆయన సతీమణి స్పందిస్తూ.. సరైన సంబంధం కోసం చూస్తున్నట్లు తెలిపారు. మరి 'బాహుబలి'కి ఎప్పుడు 'దేవసేన' దొరుకుతుందో చూడాలి. ప్రభాస్‌ ప్రస్తుతం దర్శకుడు ఎస్‌. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. దీని చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. పూజా హెగ్డే కథానాయిక. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రంలో నటించనున్నారు.

prabhas
ప్రభాస్​

తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌కు త్వరలోనే పెళ్లి చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ వెల్లడించారు. "త్వరలోనే శ్రీనివాస్‌ వివాహం జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా.. బయట నుంచి వాడికి తగిన అమ్మాయి కోసం చూస్తున్నా" అని 'రాక్షసుడు' సక్సెస్‌ మీట్‌లో అన్నారు. మరి పెళ్లి సంబంధం కుదిరిందో, లేదో తెలియాలి. శ్రీనివాస్‌ ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్‌'లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ కథానాయికగా కనిపించనున్నారు.

srinivas bellamkonda
బెల్లంకొండ శ్రీనివాస్​

యువ హీరో వరుణ్‌తేజ్‌ పెళ్లికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'అది ఇప్పట్లో కాదులే' అన్నారు. ప్రస్తుతం వరుణ్‌ దృష్టి కెరీర్‌పై ఉంది. 'గద్దలకొండ గణేశ్‌' హిట్‌ తర్వాత బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాత్ర కోసం వరుణ్‌ ఎన్నో కసరత్తులు చేసి ఫిట్‌గా తయారు కావడమే కాదు.. బాక్సింగ్‌లో మెళకువలు నేర్చుకున్నారు.

varun
వరుణ్​

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి. సహాయ నటుడిగానే కాకుండా కథానాయకుడిగానూ మెప్పిస్తున్నారు. 'గుండెల్లో గోదారి', 'సరైనోడు', 'మలుపు', 'రంగస్థలం', 'యూటర్న్‌'తో గుర్తింపు పొందారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆది తన పెళ్లి గురించి ప్రస్తావించారు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే తన వివాహం గురించి ప్రకటిస్తానని చెప్పారు. కానీ ఆపై దాని ఊసే ఎత్తలేదు.

adi pinisetti
ఆది పినిశెట్టి

అక్కినేని హీరో అఖిల్‌ ఓ ఇంటివాడు అయిపోయినట్లేనని అందరూ అనుకున్నారు. 2016లో ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌తో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పెళ్లి తేదీ కూడా ఖరారు చేశారు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. దీని తర్వాత అఖిల్‌ కెరీర్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'లో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక.

akhil
అఖిల్​

ఇక విజయ్‌ దేవరకొండ, సాయిధరమ్‌ తేజ్‌, శర్వానంద్‌, రామ్‌, కార్తికేయ, నాగశౌర్య, అల్లు శిరీష్‌.. పెళ్లి కబురు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం వీరంతా కెరీర్‌పై దృష్టి పెట్టారు. సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రశ్నించినా.. ఇప్పుడే కాదు అన్నట్లు నవ్వుతూ తప్పించుకుంటున్నారు. మరి వీరికి పెళ్లి గడియలు ఎప్పుడు వస్తాయో చూడాలి.

ఇదీ చూడండి : 'లింగ భేదంతో సంబంధం లేని ఆకర్షణ నాది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.