ETV Bharat / sitara

కష్టసమయాల్లోనూ కథానాయికల 'డబుల్ ధమాకా' - అశ్వథ్థామ

కరోనా సమయంలోనూ జోరు కొనసాగించారు కొందరు కథానాయికలు. అటు వెండితెరపైన... ఇటు డిజిటల్​ వేదికలపైనా అభిమానులను అలరించడంలో ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇచ్చిన కథానాయికలపై ప్రత్యేక కథనం మీ కోసం...

Hit heroins
కష్టసమయాల్లోనూ కథానాయికల డబుల్ ధమాకా!
author img

By

Published : Dec 11, 2020, 8:39 AM IST

కరోనా.. చిత్రసీమలో కటిక చీకట్లను నింపింది. ఈ మహమ్మారి దెబ్బకు 2020 సినీ క్యాలెండర్‌లో తొలి మూడు నెలలు మినహా.. మిగతాదంతా శూన్యమాసమన్నట్లుగానే నడిచింది. వేసవి వినోదాలు.. దసరా సరదాలు.. దీపావళి కాంతులు.. ఇలా అన్ని సినీ పండగలు కరోనా కాటుకు ఆవిరైపోయాయి. ఇంతటి కఠిన ఏడాదిలోనూ సినీప్రియులకు డబుల్‌ ట్రీట్‌ వినోదాలు పంచిచ్చారు పలువురు కథానాయికలు. ఇందులో వెండితెరపై జోరు చూపించిన అందాల భామలు కొందరైతే.. అటు వెండితెరపైనా ఇటు డిజిటల్‌ వేదికలపైనా మెరుపులు మెరిపించిన ముద్దుగుమ్మలు మరికొందరు. మరి ఈ ఏడాది డబుల్‌ ధమాకా ఇచ్చిన కథానాయికలు ఎవరో చూసేద్దాం పదండి..

వెండితెర వినోదాలకు, చిత్రీకరణలకు లాక్‌డౌన్‌ రూపంలో లాక్‌ పడటంతో.. వరుస చిత్రాలతో జోరు చూపించే స్టార్‌ నాయికలంతా ఒక్కసారిగా నెమ్మదించాల్సి వచ్చింది. ఫలితంగా సమంత, అనుష్క, పూజా హెగ్డే వంటి వారే ఈ ఏడాది ఒక్క సినిమాకే పరిమితమయ్యారు. కాజల్‌, తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి, రాశీ ఖన్నా లాంటి వారైతే వెండితెరపై దర్శనమివ్వలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డబుల్‌ ధమాకా వినోదాలు రుచి చూపించారు కొందరు కథానాయికలు.

అమ్మోరు తల్లిగా....

గతేడాది తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకు పైగా చిత్రాలతో జోరు చూపించింది అగ్ర కథానాయిక నయనతార. వీటిలో 'విశ్వాసం', 'సైరా', 'బిగిల్‌' వంటి భారీ హిట్లున్నాయి. ఆమె ఇదే ఊపును 'దర్బార్‌', 'అమ్మోరు తల్లి' చిత్రాలతో ఈ ఏడాది కొనసాగించింది. వీటిలో ఆమె రజనీ కాంత్‌కు జోడీగా నటించిన 'దర్బార్‌' సంక్రాంతికి థియేటర్లలో విడుదల కాగా.. ఆమె చేసిన నాయికా ప్రాధాన్య చిత్రం 'అమ్మోరు తల్లి' ఇటీవలే డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదలైంది.

Hit heroins
నయనతార

వరుస హిట్లతో రష్మిక...

గతేడాది 'డియర్‌ కామ్రేడ్‌'తో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. ఈ ఏడాది రెండు వరుస విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ముగ్గుల పండక్కి మహేష్‌బాబుతో కలిసి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో అదిరిపోయే హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఆమె.. ఫిబ్రవరిలో నితిన్‌తో కలిసి 'భీష్మ' రూపంలో మరో విజయాన్ని అందుకుంది.

Hit heroins
నేషనల్ క్రష్ రష్మిక

మిస్​ ఇండియాగా కీర్తి..

'మహానటి'తో జాతీయ స్థాయిలో మెరిసిన కీర్తి సురేష్‌.. 2019లో పెద్దగా జోరు చూపించలేదు. ఈ ఏడాది ఓటీటీ వేదికగా వరుస చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె నటించిన తొలి థ్రిల్లర్‌ చిత్రం 'పెంగ్విన్‌' ఈ జూన్‌లోనే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాగా.. 'మిస్‌ ఇండియా' ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఈ రెండింటికీ సినీప్రియుల నుంచి మిశ్రమ ఆదరణే దక్కింది.

విక్టరీ ఇవ్వని 'వి'

కెరీర్‌ ఆరంభం నుంచీ వైవిధ్యమైన పాత్రలతోనే ప్రయాణిస్తున్న నటి నివేదా థామస్‌. ఆమె 2019లో '118', 'బ్రోచేవారెవరురా' చిత్రాలతో విజయాలు అందుకొంది. ఇదే పంథాలో ఈ ఏడాది 'దర్బార్‌', 'వి' చిత్రాలతో జోరు చూపించే ప్రయత్నం చేసింది. అయితే వీటిలో 'దర్బార్‌'కు ఆదరణ దక్కినా.. నాని - సుధీర్‌బాబులతో చేసిన 'వి' మాత్రం ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.

Hit heroins
నివేదా థామస్

మెప్పించిన పాయల్

గతేడాది ఆఖర్లో 'వెంకీమామ' రూపంలో ఓ హిట్‌ను ఖాతాలో వేసుకుంది నటి పాయల్‌ రాజ్‌పూత్‌. ఈ ఏడాది ఆరంభంలో రవితేజతో కలిసి 'డిస్కోరాజా' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇది నిరాశపరిచింది. ఇటీవలే ఓటీటీ వేదికగా 'అనగనగా ఓ అతిథి' చిత్రంతో అందరినీ మెప్పించింది.

Hit heroins
పాయల్ రాజ్​పుత్

రన్​ 'సీరత్'​ రన్

'రన్‌ రాజా రన్‌' చిత్రంతో తొలి అడుగులోనే మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న నటి సీరత్‌ కపూర్‌. ఈ ఏడాది 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా' చిత్రంతో ఓటీటీ వేదికగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల 'మా వింత గాథ వినుమా'తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించింది.

Hit heroins
సీరత్

మెహరీన్‌ ట్రిపుల్‌ ధమాకా..

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో 2016లో తెలుగు తెరపై కాలుమోపిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్‌. ఆమె నుంచి ప్రతి ఏడాదీ మూడు చిత్రాలైనా బాక్సాఫీస్‌ ముందుకొస్తుంటాయి. ఈ మ్యాజిక్‌ను ఈ ఏడాదీ విజయవంతంగా రిపీట్‌ చేసింది మెహరీన్‌. ఈ సంక్రాంతికి తెలుగులో 'ఎంత మంచివాడవురా' చిత్రంతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన ఆమె.. తమిళంలో 'పటాస్‌'తో సినీప్రియుల్ని పలకరించింది. ఇక జనవరి నెలాఖరులో 'అశ్వథ్థామ'తో వచ్చింది. ఇలా ఈ ఏడాది ట్రిపుల్‌ ట్రీట్‌ ఇచ్చి ఎక్కువ స్కోరు దక్కించుకుంది మెహరీన్‌.

Hit heroins
మెహరీన్

ఇదీ చదవండి:'నేను స్వలింగ సంపర్కురాలిని కాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.