టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'తిమ్మరుసు'. సత్యదేవ్ ఇందులో న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను దర్శకుడు పూరీ జగన్నాధ్ బుధవారం సోషల్‌మీడియాలో విడుదల చేశారు.
అగ్ర కథానాయిక అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరి నది దాటిన ఆమె ముఖానికి మాస్కు ఉండటం వల్ల స్థానికులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి స్వీటీ కనిపించారు. చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఉన్నప్పటికీ ఎటువంటి ఆడంబరం లేకుండా ఆమె వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్‌తో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్‌ల కోసం దర్శకుడు చెన్నై వెళ్లారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయ్యింది. రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్‌గా నిర్వహిస్తున్న టాక్ షో 'సామ్ జామ్'. ఆహా ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా హాజరైంది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
ఆది సాయికుమార్, వేదిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'జంగిల్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేయనుంది. కార్తిక్-విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. మహేశ్ గోవిందరాజు, అర్చన చంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">




