దేశంలో కరోనా కారణంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రధానంగా ముంబయిలో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. నగరంలో దశాబ్దాలుగా వేలాది మందికి భోజనం అందిస్తున్న డబ్బావాలాల జీవనోపాధి కరోనా ధాటికి పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా ముందుకొచ్చి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు.
లాక్డౌన్ వేళ ప్రభుత్వం డబ్బావాలాలకు సాయం చేస్తుందని రాష్ట్ర మంత్రి అస్లాం షేఖ్ చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు సంజయ్.
-
The dabbawalas have been serving us for decades & bringing food to so many Mumbaikars. Now is the time when we should come forward and support them! @CMOMaharashtra @AUThackeray @SunielVShetty https://t.co/n6g4r3IrvP
— Sanjay Dutt (@duttsanjay) June 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The dabbawalas have been serving us for decades & bringing food to so many Mumbaikars. Now is the time when we should come forward and support them! @CMOMaharashtra @AUThackeray @SunielVShetty https://t.co/n6g4r3IrvP
— Sanjay Dutt (@duttsanjay) June 8, 2020The dabbawalas have been serving us for decades & bringing food to so many Mumbaikars. Now is the time when we should come forward and support them! @CMOMaharashtra @AUThackeray @SunielVShetty https://t.co/n6g4r3IrvP
— Sanjay Dutt (@duttsanjay) June 8, 2020
"డబ్బావాలాలు దశాబ్దాలుగా మనకు సేవ చేస్తున్నారు. ముంబయి వాసులకు ఆహారాన్ని తీసుకొచ్చి ఆకలిని తీర్చారు. ఇప్పుడు మనమంతా వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం వచ్చింది." అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చిన సంజయ్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రే, నటుడు సునీల్ శెట్టిలను ట్యాగ్ చేశారు.
ఇదీ చూడండి:పాత జ్ఞాపకం చూసి సోనూసూద్ భావోద్వేగం