ETV Bharat / sitara

Tiger Shroff: 2090 కథతో టైగర్​ కొత్త చిత్రం​! - టైగర్​ ఫ్రాఫ్​ గణ్​పథ్​

టైగర్​ ష్రాఫ్​ 'గణ్​పథ్​' సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. 2090 నేపథ్యంగా ఈ చిత్రం సాగనుందని మాట్లాడుకుంటున్నారు. అక్టోబరు నుంచి ఈ చిత్రం సైట్స్​పైకి వెళ్లనుంది.

tiger shroff new movie
ఆసక్తికర కథాంశంతో టైగర్​ కొత్త చిత్రం​!
author img

By

Published : Aug 31, 2021, 7:04 AM IST

బాలీవుడ్​లో యాక్షన్​ చిత్రాలతో మంచి జోరుమీదున్న యువ కథానాయకుడు టైగర్​ ష్రాఫ్(tiger shroff)​. ప్రస్తుతం ఆయన నుంచి రెండు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఒకటి 'హీరో పంటి 2', రెండోది 'గణ్​పథ్'(tiger shroff ganapath)​. ఈ రెండింటి పైనా మంచి అంచనాలున్నాయి. తాజాగా 'గణ్​పథ్​' చిత్ర కథ గురించి ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. 'ఈ చిత్రం 2090 నేపథ్యంలో సాగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కాల్పనిక కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. యుద్ధాలు, ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచం ఏవిధంగా ధ్వంసమైపోతుందో ఇందులో చూపించనున్నారు. దర్శకుడు వికాస్ భళ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నారు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడటం లేదు' అని బాలీవుడ్​ వర్గాల సమాచారం.

ఇదే నిజమైతే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని.. భారీ స్థాయి విజువల్​ హంగులతో కూడిన ఇలాంటి చిత్రాలే కొవిడ్​ పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలవు అని ట్రేడ్​ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో కృతి సనన్ కథానాయిక. అక్టోబరు నుంచి ఈ చిత్రం సైట్స్​పైకి వెళ్లనుంది. 2022 డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఇదీ చూడండి : అల్లు అర్జున్ మరో రికార్డు.. తొలి దక్షిణాది నటుడిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.