ప్రతిష్ఠాత్మక కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(Kanes Film Festival) ప్రతిఏటా ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో అట్టహాసంగా జరుగుతుంది. ఈ వేడుకలో మహామహుల్లాంటి తారలకు అక్కడి రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ టు హాలీవుడ్ నాయికలు కళ్లు చెదిరే కొత్త ఫ్యాషన్ దుస్తులను ధరించి ఈ ఎర్రతివాచీపై వయ్యారాలు ఒలకబోస్తుంటే కెమెరాలన్నీ వారివైపే తిరుగుతుంటాయి. సుందరీమణులంతా ర్యాంప్ వాక్‌లు చేస్తూ వారి హొయలతో మతిపోగొడుతుంటారు. అయితే ఈ సారి బాలీవుడ్(Bollywood) భామలకు ఎర్రతివాచీ స్వాగతం దక్కకుండా పోయింది. కేవలం హాలీవుడ్ తారలు మాత్రమే సందడిచేశారు.
ఇదే కారణం
గతేడాది కరోనా కారణంగా రద్దైన ప్రపంచ ప్రఖ్యాత 'కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం' ఈసారి కరోనా ఆంక్షల నడుమ ఘనంగా నిర్వహించారు. ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరం వేదికగా.. మంగళవారం ఈ సినిమా సంబరం ఘనంగా ప్రారంభమైంది. కొవిడ్ టీకా తీసుకున్నవారిని లేదా 48 గంటల ముందు కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అయితే ప్రయాణాల విషయంలో భారత్‌ను రెడ్ లిస్ట్‌లో చేర్చారు. భారత్ నుంచి ఫ్రాన్స్ వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగా మన అందాల భామలు అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు. దీంతో కేవలం హాలీవుడ్ భామలు మాత్రమే అందాలను ఆరబోశారు. ఈ నేపథ్యంలో గతంలో కేన్స్ ఎర్రతివాచీపై తళుక్కుమన్న మన ముద్దుగుమ్మల ఫొటోలపై ఓ లుక్కేద్దాం..
హొయలు ఒలికిస్తున్న చిత్రాలు
చిత్రోత్సవంలో భాగంగా.. మొదటి రోజు ఎర్ర తివాచీపై పలువురు హాలీవుడ్ తారలు నడుస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వచ్చే శనివారం(జులై 17) వరకు ఈ సినీ సంబరం కొనసాగనుంది. ఆరంభ చిత్రంగా లియోస్ కారక్స్ తెరకెక్కించిన 'అన్నెట్టే' చిత్రాన్ని ప్రదర్శించారు.
ఇదీ చూడండి: