స్వాతంత్ర్య దినోత్సవం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా 'ఖడ్గం.' ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో ప్రసారమవుతుంది. ఈ దేశభక్తి సినిమాను చాలా మంది చూడటానికి ఇష్టపడతారు. అయితే మార్పుకోరుకునే వారికి అనేక దేశభక్తి కథలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ వేదికల్లో వెబ్‌సిరీస్ రూపంలో ఇవి ఇప్పటికే అలరిస్తున్నాయి. ఈ పంద్రాగస్టుకు మీరూ వీటిపై ఓ లుక్కేయండి.
ది ఫ్యామిలీ మ్యాన్(The family man)..
ది ఫ్యామిలీ మ్యాన్.. ఓ స్పై డ్రామా సిరీస్. ఇప్పటికి రెండు భాగాలు వచ్చాయి. రెండింటికీ మంచి ఆదరణ లభించింది. ఓ నిఘా ఆఫీసర్.. అటు దేశాన్ని ఉగ్రవాదుల నుంచి రక్షిస్తూనే తన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది కథ. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది ఈ వెబ్ సిరీస్. మనోజ్ బాజ్పేయీ నటన ఈ వెబ్ సిరీస్ స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక ఆలస్యం చేయకుండా అమెజాన్ ప్రైమ్‌లో మీరూ ఈ సిరీస్ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ది ఫర్గాటెన్ ఆర్మీ- ఆజాదీ కే లియే(The Forgotten Army - Azaadi ke Liye)...
నిజ జీవతాల ఆధారంగా కబీర్ ఖాన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సారథ్యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యులు.. దేశ స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా పోరాటం చేశారనేది కథ. విక్కీ కౌశల్ సోదరుడు సన్నీ కౌశల్, శర్వారి వా కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఇది అందుబాటులో ఉంది.
కోడ్ ఎమ్(Code M)..
ఓ ఎన్కౌంటర్ చుట్టూ సాగే కేసుపై ఆధారపడిన ఇది. ఎన్కౌంటర్ కారణంగా ఓ ఆర్మీ అధికారి, ఇద్దరు ముష్కరులు మరణించారని కేసు మూసేస్తారు. కానీ అక్కడ ఎన్‌కౌంటర్‌కు మించిన వ్యవహారం ఉందని తెలుసుకున్న ఓ న్యాయవాది.. కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మిగిలిన కథ. న్యాయవాదిగా మానికా మెహ్రా మంచి ప్రదర్శన చేసింది. రజత్ కపూర్, సీమా విశ్వాస్, తనూజ్ విర్వాని నటన కథకు కీలకం. ఇది ఏఎల్టీ బాలాజీ, జీ5లో అందుబాటులో ఉంది.
జీత్ కి జిద్(Jeet Ki Zid)...
ఆర్మీ స్పెషల్‌ఫోర్స్ ఆఫీసర్ మేజర్ దీపేంద్ర సింగ్ సెంగార్ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ సిరిస్ జీత్ కి జిద్. కార్గిల్ యుద్ధం సమయంలో పక్షవాతానికి గురైనప్పటికీ.. జీవిత పోరాటాన్ని సెంగార్ సాగించిన తీరును చక్కగా చూపించారు. విశాల్ మంగోల్కర్ దర్శకత్వంలో అమిత్ సాద్.. మేజర్ దీపేంద్రగా చక్కటి నటను ప్రదర్శించారు. ఇది జీ5 యాప్‌లో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అవ్రోధ్- ది సీజ్ వితిన్(Avrodh: The Siege Within)...
2016 ఉరి లక్షిత దాడుల నేపథ్యంలో సాగుతుంది ఈ కథ. 'ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్' పుస్తకం దీనికి మూలం. అమిత్ సాధ్, నీరజ్ కబి లీడ్ రోల్స్‌లో నటించారు. రాజ్ ఆచార్య తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్ సోనీలివ్‌లో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రెజిమెంట్ డైరీస్(Regiment Diaries)...
ఈ వెబ్ సిరీస్‌లో భారత సైనికుల కథలను చిత్రీకరించారు. నిజ జీవితంలోని వ్యక్తులు, వారికి జరిగిన ఎన్నో సంఘటనల సమూహం ఈ రెజిమెంట్ డైరీస్. ఇంటర్వ్యూలు, చారిత్రక ఫుటేజీలతో కథలు అద్భుతంగా ముందుకు సాగుతాయి. సోనీలివ్‌లో ఇది చూడవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్పెషల్ ఆప్స్(Special OPS)...
26/11 ముంబయి దాడులతో సహా గత 19ఏళ్లల్లో భారత్‌పై జరిగిన ఉగ్రదాడుల ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. కే మీనన్, దివ్య దత్త, సయామీ ఖేర్, కరణ్ థాకర్, వినయ్ పాథక్, ముజామ్మిల్ ఇబ్రహీమ్ వంటి నటులు అద్భుత ప్రదర్శనలు చేశారు. నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.
బోస్ డెడ్ ఆర్ ఎలైవ్(Bose Dead or Alive)...
సుభాష్ చంద్ర బోస్ జీవితం ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. రాజ్ కుమార్ రావ్.. బోస్ పాత్రలో నటించి మెప్పించారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటం నుంచి ఆయన అనుమానాస్పద మరణం వరకు ఈ కథ సాగుతుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్ చూడొచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బార్డ్ ఆఫ్ బ్లడ్(Bard of Blood)...
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి నటించిన ఈ స్పై థ్రిల్లర్‌కు మంచి ఆదరణ లభించింది. 2015లో వచ్చిన బార్డ్ ఆఫ్ బ్లడ్ నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. గూఢచర్యం చుట్టూ కథ అల్లారు. కృతి కుల్హారి, వినీత్ కుమార్ సింగ్, జైదీప్ అహ్లవాత్, శోభితా ధూలిపాళ్ల నటించిన బార్డ్ ఆఫ్ బ్లడ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
ది టెస్ట్ కేస్(The Test Case)..
స్పెషల్ ఫోర్స్‌లోని ఏకైక మహిళ కెప్టెన్ శిఖా శర్మ కథ ఆధారంగా ఈ సిరీస్ తీశారు. నిమ్రిత్ కౌర్ ప్రధాన పాత్ర పోషించింది. అతుల్ కులకర్ణి, అనూప్ సొనీ కీలక పాత్రల్లో నటించారు. ఏఎల్టీ బాలాజీ, జీ5లో ఈ వెబ్‌సిరీస్ అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
21 సర్ఫరోష్- సారాగఢి 1897(21 Sarfarosh: Saragarhi 1897)
సారాగఢి యుద్ధం ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. 1897లో ఆక్రమణకు ప్రయత్నించిన పస్థూన్ ఒరక్జీ తెగ ప్రజలతో నాటి బ్రిటీష్ ఇండియా ఆర్మీలోని 21మంది సిక్కు సైనికులు వీరోచితంగా పోరాడారు. 21మంది 10,000కుపైగా మందిని అడ్డుకున్నారు. ఈ పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోయింది. మోహిత్ రైనా, ముకుల్ దేవ్ కీలక పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పీఓడబ్ల్యూ- బంధి యుధ్ కీ(POW: Bandhi Yudh Ke)...
ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. 17ఏళ్ల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం ఇద్దరు సైనికులు తమ కుటుంబాలను కలుసుకోవడం ఈ కథ సారాంశం. అమృత పూరి, సంధ్య మృదుల్, పురబ్ కోహ్లి, సత్యదీప్ మిశ్రా కీలక పాత్రలు పోషించారు. హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమ్ అవుతోంది.
ఇదీ చూడండి:- ఓటీటీలో ఆ 'స్టోరీ'లకు ఎందుకంత క్రేజ్?