ETV Bharat / sitara

'చెక్క మొహం అన్నారు.. ఆ మాటలు ఎంతగానో బాధపెట్టాయి' - దీపిక పడుకొనే వార్తలు

అందం... రాజసం కలబోస్తే ప్రేక్షకులు మెచ్చుకునే ‘పద్మావతి’ దీపిక పదుకొణె అవుతుంది. బాలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ఈ అమ్మడు తెలుగులో ప్రభాస్‌తో జతకట్టనుంది. సినీ నేపథ్యం లేకపోయినా సవాళ్లు ఎదురైనా నంబర్‌ వన్‌ అనిపించుకున్న దీపిక జీవితంలో కొన్ని చెప్పుకోదగిన సందర్భాలివి.

deepika padukone
deepika padukone
author img

By

Published : Aug 2, 2020, 1:22 PM IST

తీరని కల

నేను బాగా చదువుకోవాలనీ, క్రీడాకారిణిని కావాలనీ అమ్మానాన్నలు కలలు కన్నారు. అందుకే బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పించారు. కానీ వాళ్లకి ఇష్టం లేకపోయినా ఇంటర్‌తోనే చదువూ, ఆటలూ ఆపేశా. మోడలింగ్‌ చేయాలని బ్యాగు నిండా బట్టలతో... కళ్ల నిండా కలలతో ముంబయిలో అడుగుపెట్టా. కనీసం సినిమాల్లోకి వచ్చాకైనా దూరవిద్యలో పీజీ చేస్తానని అమ్మ ఎదురుచూసింది. కానీ చదవడానికి టైం దొరకలేదు. ఇక మీదట దొరుకుతుందనీ అనుకోను. ఎప్పటికీ అది తీరని కలగానే మిగులుతుందేమో!

బాధించింది

సినీ రంగంలో గాడ్‌ఫాదర్‌ లేకుండా నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. ఒంటరిగానే మోడలింగ్‌ ప్రపంచంలో అడుగుపెట్టి¨ ‘కింగ్‌ ఫిషర్‌ మోడల్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును అందుకున్నా. తరవాత అనుపమ్‌ఖేర్‌ స్కూల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌లో చేరా. అక్కడ ఉండగానే మన్మథుడు రీమేక్‌తోపాటు హిమేశ్‌ రేషమియా హిందీ ఆల్బమ్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా షారూఖ్‌ కంట పడి ‘ఓం శాంతి ఓం ’లో ఛాన్స్‌ కొట్టేశా. అది హిట్‌ అయినా ఆ తరవాత వరస ఫ్లాప్‌లు రావడంతో చాలామంది చెక్క మొహం అంటూ విమర్శించారు. ఆ మాటలు ఎంతగానో బాధపెట్టాయి. ఇప్పుడు ఆ నోళ్లే చక్కని చుక్కంటూ పొగుడుతున్నాయి.

ఓ సవాలు

‘పద్మావతి’ కోసం వందరోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. కత్తులతో పోరాటం... గుర్రపు స్వారీల వంటివి లేకపోయినా అది చాలా బరువైన పాత్ర. ఎందుకంటే ఆ సినిమాలో నేను ధరించిన నగలు 20 కేజీలు, లెహెంగా 30 కేజీల బరువు ఉండేవి. రోజుకి 12-14 గంటలు షూటింగ్‌ జరిగేది. అన్ని గంటలపాటు ఆ బరువు మోయడం సవాలుగా అనిపించేది. కాసేపు తీసి పక్కన పెట్టడానికి ఉండేది కాదు. కొన్ని బరువైన హారాలు ధరించినప్పుడు మెడ ఒరుసుకుని ఎర్రగా అయి నొప్పి పుట్టేది. ఆ ప్రభావం షూటింగ్‌పైన పడకుండా ఓర్చుకున్నా.

సంతోషం

మానసిక కుంగుబాటు నుంచి బయటపడిన నేను అలాంటి వారికోసం ‘ది లైఫ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశా. ‘మీరు ఒంటరివాళ్లు కాదు’ అనే పేరుతో పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపడుతూ అవసరం ఉన్నవాళ్లకి ఉచితంగా చికిత్స అందేలా చూస్తున్నా. డిప్రెషన్‌లో ఉన్నవారు తమ అనుభవాలను ‘నాట్‌ ఎషేమ్డ్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా పంచుకునేలా ప్రోత్సహిస్తున్నా. ఇలా చేయడం నాకు చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది.

సంతృప్తి

యాసిడ్‌ దాడి బాధితుల బాధను కళ్లకు కట్టాలని ‘ఛపాక్‌’ కోసం నిర్మాతగా కూడా మారా. అందులో ముఖంపైన యాసిడ్‌ పడినట్టు కనిపించడానికి లండన్‌కి చెందిన ప్రోస్థటిక్‌ నిపుణులు ఎంతో కష్టపడ్డారు. ఆ మేకప్‌ వేయడానికి దాదాపు నాలుగు గంటలు... తీయడానికి మరో రెండు గంటలు పట్టేది. మొదటి రోజు మేకప్‌ వేసుకుని అద్దంలో నా ముఖాన్ని చూసుకుని ఏడ్చేశా. పైగా మాంచి ఎండల్లో దిల్లీ వీధుల్లో ఆ షూటింగ్‌ జరిగింది. ఆ వేడికీ, ప్రోస్థటిక్‌ మేకప్‌ వల్లా గాలి తగలక దద్దుర్లు వచ్చి చర్మం మండిపోయేది. అయినా విరామం తీసుకోకుండా చాలా త్వరగా షూటింగ్‌ పూర్తిచేశాం. ఇబ్బంది పడ్డా ఆ పాత్ర నాకెంతో సంతృప్తిని ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.