సినీ ప్రియులకు 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రబృందం మరో కానుక అందించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా (RRR Release Date) జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. 'ఆర్ఆర్‌ఆర్ సోల్ ఆంథమ్'(RRR Soul Anthem) 'జనని' అంటూ సాగే పాటను (RRR Janani Song) విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటకు ఆయనే సాహిత్యం అందించి ఆలపించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో ఈ పాట విడుదలైంది. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన 'జనని' పాటను మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి:
ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతా: రాజమౌళి