ETV Bharat / sitara

సెట్​లో మేమిద్దరం చిన్నపిల్లల్లా ఉండేవాళ్లం: నాని

author img

By

Published : Nov 30, 2021, 7:49 AM IST

సినిమా సెట్​లో నిత్యా మేనన్, తాను చిన్నపిల్లల్లా ఉండేవారమని చెప్పారు నేచురల్ స్టార్ నాని. నిత్య.. ప్రధానపాత్రలో వస్తున్న 'స్కైలాబ్' (skylab nithya menen) చిత్ర ప్రీరిలీజ్​ ఈవెంట్​లో పాల్గొన్నారు నాని. నిత్య.. మణిరత్నం లాంటి దర్శకులకే ఫేవరెట్​ అని చెప్పుకొచ్చారు నాని.

skylab nithya menen
నాని

"ప్రీరిలీజ్‌ వేడుక అనగానే చిత్ర బృందంలో ఓ టెన్షన్‌ కనిపిస్తుంది. కానీ, ఈ 'స్కైలాబ్‌' టీమ్‌లో ఆ ఒత్తిడి కనిపించడం లేదు. పరీక్షల్లో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చినట్లు అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. సినిమా కొట్టేస్తున్నామని ఆ వైబ్‌ చెప్పేస్తుంటుంది. కొన్ని చిత్రాలకు ఇలా కుదురుతుంటుంది" అన్నారు కథానాయకుడు నాని. ఇటీవల జరిగిన 'స్కైలాబ్‌' (skylab nithya menen) చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యదేవ్‌, నిత్యా మేనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. విశ్వక్‌ ఖండేరావు తెరకెక్కించారు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ఈ సినిమా డిసెంబరు 4న (skylab telugu movie release date) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.

skylab nithya menen
ప్రీరిలీజ్​ ఈవెంట్​లో నాని

"స్కైలాబ్‌ గురించి చిన్నప్పుడు నేనూ చాలా కథలు విన్నా. అది మా ఊరి దగ్గర్లో పడిపోతుందని అందరూ భయపడ్డారట. అలాంటి ఓ ఆసక్తికర ఆలోచనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు విశ్వక్‌. నిజానికి ఆయన ఈ కథ నాకు చెప్పాలనుకున్నాడట. మిస్‌ అయినందుకు చాలా బాధేసింది. కానీ, అది వెళ్లి మా నిత్య, పృథ్వీల చేతుల్లో పడింది కాబట్టి ఆనందంగా ఉంది. నిత్యా మేనన్‌తో 'అలా మొదలైంది' చేసి పదేళ్లు పూర్తయింది. సెట్లో ఇద్దరం చిన్నపిల్లల్లా ఉండేవాళ్లం. మణిరత్నం లాంటి దర్శకులకే ఫేవరెట్‌ యాక్టర్‌ నిత్య. తను ఏ భాషకు వెళ్లినా.. మంచి నటి అని పేరు వినిపిస్తుంటుంది. అలాంటి తను ఈ సినిమాతో నిర్మాతగా మారిందంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తను రామానాయుడు, దిల్‌రాజులా వందల సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. టికెట్‌ రేట్ల గురించి గతంలోనే మాట్లాడా. మళ్లీ మాట్లాడను. ఇక మిగతా వాళ్లు మాట్లాడాలి. చూద్దాం వాళ్లు మాట్లాడతారో లేదో. సత్యని ఎప్పుడు చూసినా స్టార్‌ అవబోతున్న నటుడిలా కనిపిస్తాడు. తనలా విభిన్న చిత్రాలు చేసే హీరోలు మనకు కావాలి. రాహుల్‌ అద్భుతమైన నటుడు. విశ్వక్‌కి ఆల్‌ ది బెస్ట్‌. 'స్కైలాబ్‌' విజయానికి ఆకాశమే హద్దవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా"

-నాని, నటుడు

skylab nithya menen
నిత్యా మేనన్

నిజమైన భావోద్వేగాలు నిండి ఉన్న చిత్రమిదని అన్నారు నిత్యా మేనన్. నిర్మాతగానే కాదు.. నటిగానూ తనకెంతో తృప్తినిచ్చిన సినిమా ఇదని చెప్పారు. "ఇది మా తెలుగు సినిమా అని అందరూ గొప్పగా చెప్పుకొంటారు" అని అన్నారు సత్యదేవ్‌. "నేను ఏదైతే సినిమాలో ఉండాలనుకున్నానో.. దానికి ప్రశాంత్‌ ఆర్‌ విహారి తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఈ చిత్రానికి గొప్ప నటీనటులు దొరికారు" అని చెప్పారు దర్శకుడు విశ్వక్‌. ఈ కార్యక్రమంలో వెంకట్‌ మహా, వివేక్‌ ఆత్రేయ, మున్నా, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మహేశ్​ బాబుకు పోటీగా విజయ్ దేవరకొండ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.