ETV Bharat / sitara

కూత మొదలైంది.. చివరి షెడ్యూల్​లో 'సీటీమార్​' - గోపీచంద్​, తమన్నా వార్తలు

లాక్​డౌన్​ కారణంగా ఆగిపోయిన 'సీటీమార్'​ చిత్రీకరణ సోమవారం (నవంబరు 23) నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​తో షూటింగ్​ పూర్తి చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

The shoot of Gopichand and Tamannaah starrer Seetimaarr resumes
కూత మొదలైంది.. చివరి షెడ్యూల్​లో 'సీటీమార్​'
author img

By

Published : Nov 24, 2020, 6:33 AM IST

గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న చిత్రం 'సీటీమార్‌'. తమన్నా కథానాయిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి పునః ప్రారంభమైంది. ఇందులో గోపీచంద్‌ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకు కోచ్‌గా నటిస్తున్నారు.

పల్లెటూళ్లో ఉంటూ హీరోని ప్రేమించే పాత్రలో మరో కథానాయిక దిగంగన నటిస్తోంది. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుందని, ఈ షెడ్యూల్‌తో సినిమాని పూర్తి చేస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, భూమిక, రెహమాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌రాజన్‌, సంగీతం: మణిశర్మ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.