ETV Bharat / sitara

అదే గొప్ప అవార్డు.. పద్మ పురస్కారంపై సోనూ!

ఈ ఏడాది పద్మవిభూషణ్ అవార్డును సోనూసూద్(Sonusood)​కు ఇవ్వాలని నటుడు బ్రహ్మాజీతో పాటు పలువురు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సోనూ.. భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డని అన్నారు.

sonusood
సోనుసూద్
author img

By

Published : Jun 11, 2021, 3:16 PM IST

ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలే తనకు గొప్ప అవార్డులని ప్రముఖ నటుడు సోనూసూద్‌(Sonusood) అన్నారు. ఈ ఏడాది ‘పద్మవిభూషణ్‌’ అవార్డును సోనూసూద్‌కు ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్‌ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్‌ పెట్టారు. కొంతకాలంగా సోనూ చేస్తున్న నిర్విరామ సేవలను గుర్తించి ఈ అవార్డుతో గౌరవించాలని అభిప్రాయపడ్డారు. బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్‌పై సోనూ స్పందిస్తూ.. "బ్రదర్‌.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను" అని రిప్లై ఇచ్చారు.

  • The love of 135 crore Indians is my biggest award brother, which I have already received.🇮🇳
    Humbled 🙏 https://t.co/VpAZ8AqxDw

    — sonu sood (@SonuSood) June 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా కల్లోలం ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతోమందికి సోనూ సేవలు అందిస్తూనే ఉన్నారు. గతేడాది వలస కూలీల కోసం ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసిన సోనూసూద్‌.. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను సరఫరా చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా తనని సాయం కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆపన్నహస్తం అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.