ETV Bharat / sitara

'ద కశ్మీర్​ ఫైల్స్​'లోని ఆ సీన్ షూటింగ్​కు ఒప్పుకోని వేల మంది.. చివరకు...

The Kashmir Files: ద కశ్మీర్​ ఫైల్స్​.. 90వ దశకంలో కశ్మీర్​ పండిట్​లపై జరిగిన హత్యకాండ కథాంశంతో తెరకెక్కిన సినిమా. ఇటీవలే విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే.. ఈ సినిమాను పూర్తి చేయటంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెబుతున్నారు ప్రొడ్యూసర్లు.

The Kashmir Files
ద కశ్మీర్​ ఫైల్స్
author img

By

Published : Mar 17, 2022, 5:44 PM IST

ద కశ్మీర్​ ఫైల్స్ చిత్రీకరణ దృశ్యాలు

The Kashmir Files: ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై సూపర్​హిట్​గా నిలిచింది 'ద కశ్మీర్​ ఫైల్స్'​. 90వ దశకంలో కశ్మీర్​ పండిట్​లపై జరిగిన హత్యకాండకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమాని పూర్తి చేయటం అంత సులభమేమీ కాలేదంటున్నారు నిర్మాతలు. త్రివర్ణ పతాకాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేయటం వంటి దృశ్యాల చిత్రీకరణ సమయంలో సెట్ల వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తి పెద్ద సవాలుగా మారినట్లు చెప్పారు. ఈ అంశంపై పలు విషయాలను ఈటీవీ భారత్​తో చెప్పారు ద కశ్మీర్​ ఫైల్స్​ లైన్​ ప్రొడ్యూసర్​ పర్వ్​ బాలి.

" కశ్మీర్​ లాల్​చౌక్​ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఉగ్రవాదులు దూరంగా పడేసే సన్నివేశాన్ని ముస్సోరిలోని లాల్​తిబ్బా ప్రాంతంలో తీశాం. దానిని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. అలాంటి దృశ్యాలను ఏ భారతీయుడు సహించడు. ముస్సోరీ ప్రజలను ఒప్పించేందుకు చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకు ఏ ఒక్కరూ అంగీకరించేందుకు సిద్ధపడలేదు. ఆ సమయంలో ఏం జరుగుతోందనేది అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఒక్కరు కూడా లేరు. అలాగే.. 1990లో కశ్మీర్​ లోయలో జరిగిన ఉగ్ర చర్య సందర్భంగా కశ్మీర్​ సెంటిమెంట్​ను పునర్నిర్మించేందుకు గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాయటమూ.. ఆందోళనలకు దారి తీసింది."

- పర్వ్​ బాలి, ద కశ్మీర్​ ఫైల్స్ లైన్​ ప్రొడ్యూసర్​​

సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న క్రమంలో చిత్రీకరణలో ఎదుర్కొన్న ఇబ్బందులను నిర్మాతలు మర్చిపోయారు. చాలా రాష్ట్రాల్లో సినిమాకు వినోద పన్ను రద్దు చేశారు. ఆనాటి హింసకాండను పునర్నిర్మించినందుకు ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు.

The Kashmir Files
ద కశ్మీర్​ ఫైల్స్​లోని ఓ దృశ్యం

హిమాచల్​ నుంచి ఉత్తరాఖండ్​కు..

ద కశ్మీర్​ ఫైల్స్​ సినిమాను ముందుగా హిమాచల్​ప్రదేశ్​లో చిత్రీకరించాలనుకుంది చిత్ర యూనిట్​. అయితే, ఉత్తరాఖండ్​లో ఎక్కువ భాగం నిర్మించారు. దెహ్రాదూన్​, ముస్సోరీలోనే చాలా వరకు చిత్రీకరణ పూర్తిచేశారు. ఈ సినిమాకు లైన్​ ప్రొడక్షన్​ పనులను దెహ్రాదూన్​కు చెందిన ద బజ్​ మేకర్స్​ చూసుకుంది. ఈ చిత్రం మూడేళ్ల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు మరో లైన్​ ప్రొడ్యూసర్​ గౌరవ్​ గౌతమ్​. హిమాచల్​లో చిత్రీకరించాలని నిర్ణయించినప్పటికీ.. ఉత్తరాఖండ్​లో చేపట్టాలని దర్శకుడు వివేక్​ రంజన్​ అగ్నిహోత్రిని ద బజ్​​ మేకర్స్​ కోరటం వల్ల అక్కడికి మార్చినట్లు చెప్పారు. ముస్సోరీలోని చాలా ప్రాంతాలు కశ్మీర్​ను తలపిస్తాయని, ముస్సోరీ లైబ్రరీ ప్రాంతం కశ్మీర్​లోని లాల్​ చౌక్​ మాదిరిగా ఉండటం వల్ల చిత్రీకరణను అక్కడికి మార్చినట్లు తెలిపారు. కశ్మీర్​ ఫైల్స్​ సినిమాలోని లాల్​ చౌక్ దృశ్యం చాలా ఫేమస్​. అనుపమ్ కేర్​ అక్కడే పరిచయమవుతారు. ఆ దృశ్యాలను ముస్సోరీలోని లైబ్రరీ చౌక్​లో తీశారు. అది లాల్​ చౌకా లేక లైబ్రరీ చౌకా అనేది గుర్తుపట్టటం చాలా క్లిష్ఠమని చెప్పారు గౌరవ్​.

ఉత్తరాఖండ్ అప్పటి ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్​ రావత్​ నేతృత్వంలోని అధికార యంత్రాంగం తమకు చాలా మద్దతుగా నిలిచినట్లు ద బజ్​ మేకర్స్​ పేర్కొంది. ఈ చిత్రంలో ఉత్తరాఖండ్​ ప్రజలకు జూనియర్​ ఆర్టిస్టులు, ఇతర క్యారెక్టర్​ ఆర్టిస్టులుగా అవకాశం లభించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.