The Kashmir Files Director Vivek Agnihotri: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇటీవలే చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్‌లో దుమారం రేపుతున్నాయి. "భోపాలీ అంటే స్థానిక వాడుక భాషలో 'స్వలింగ సంపర్కులు' అని అర్థం" అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వీడియోక్లిప్ వైరల్ అవుతోంది.
ఈ వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సహా, పార్టీ రాష్ట్ర నేతలు తీవ్రంగా ఖండించారు. భోపాల్ నగరాన్ని వివేక్ అవమానించారని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భోపాల్.. భోజ రాజు సాంస్కృతిక వారసత్వ నగరమని, కళలకు నిలయమని అన్నారు. అలాంటిది వివేక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి.. నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
కశ్మీరీ పండితుల జీవితంపై బాలీవుడ్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది కశ్మీర్ ఫైల్స్'. 1990లలో జమ్మూ-కశ్మీర్‌లో చేలరేగిన తీవ్రమైన ఉగ్రవాదంలో పండిట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణాలు చూడలేక ఎంతోమంది సొంతూరుని వదిలిపెట్టి కట్టుబట్టలతో వలస వెళ్లిపోయారు. ఆ కన్నీటి వెతల రూపమే 'ది కశ్మీర్ ఫైల్స్'. చిన్న చిత్రంగా మొదలైన 'కశ్మీర్ ఫైల్స్'.. కొద్దిరోజుల్లోనే సంచనంగా మారింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
ఇదీ చూడండి: ఊర మాస్ లుక్లో నితిన్.. రామ్ 'ది వారియర్' క్రేజీ అప్డేట్