బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణెతో మూడోసారి కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వీరిద్దరూ 'పీకూ'లో నటించగా, ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో చేయనున్నారు.
![Deepika The Intern remake](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11078714_deepika.jpg)
రిషి కపూర్ స్థానంలో అమితాబ్
హాలీవుడ్ హిట్ సినిమా 'ద ఇంటెర్న్'ను హిందీ రీమేక్ చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. రిషి కపూర్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత కరోనాతో లాక్డౌన్ పెట్టడం, కొన్నాళ్ల తర్వాత రిషి కపూర్ అనారోగ్యంతో మరణించడం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.
ఇప్పుడు ఆ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమితాబ్‌ను సంప్రదించారట. ఆయన అంగీకారం తెలిపిన వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">